నవతెలంగాణ -తాడ్వాయి : వేర్వేరు ఘటనలో దెబ్బగట్ల మహేష్(7) బాలుడు, మడవి అర్జున్(34) గుత్తి కోయ యువకుడు అనే ఇద్దరు మృతి చెందారు. ఊరట్టం గ్రామానికి చెందిన దబ్బగట్ల చంద్రయ్య అనే గుత్తి కోయ యువకుని కుమారుడు దబ్బకట్ల మహేష్(7) అనే బాలుడు రెండవ తారీకు శుక్రవారం ఇంటి పక్కన చెట్టు కింద ఉన్న ట్రాక్టర్ ట్రాలీ ఎక్కి ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. బలమైన గాయం అయినందున ములుగు ప్రభుత్వ హాస్పటల్ కు తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం ఎంజిఎంకు తరలించారు. ఎంజీఎంలో వైద్యం పొందుతూ శనివారం మృతి చెందినట్లు తెలిపారు. గుత్తి కోయ యువకుడు మడవి అర్జున్(34) బీజాపూర్, హైదరాబాద్ ప్రాంతాలలో బోర్ బండిపై కూలి పని చేసుకుంటూ జీవించేవాడు. నార్లాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో గల తక్కల్లగూడెం గుత్తి గూడెంలో అతని అన్న దగ్గరికి పాయం సురేందర్ అనే వ్యక్తి బైక్ పై వస్తుండగా.. వెంగళాపూర్ గ్రామం వద్దకు చేరుకోగానే సురేంద్ర అనే వ్యక్తి అతివేగంగా విచక్షణ రహితంగా బండి నడపడంతో వెనుక కూర్చున్న అర్జున్ కింద తారు రోడ్డుపై పడిపోయాడు. తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. కాగా బైకుపై ఇష్ట రాజ్యంగా అతివేగంగా నడిపి మా తమ్ముని మృతికి కారకుడైన సురేందర్ పై చర్యలు తీసుకోవాలని బాదిత కుటుంబ సభ్యులు కోరారు. దర్యాప్తు నిర్వహించి చట్టం ప్రకారం శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్సై తెలిపారు.
వేరువేరు ప్రమాదాల్లో బాలుడు, యువకుడు మృతి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES