నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా ‘గుర్రం పాపిరెడ్డి’. డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. మురళీ మనోహర్ దర్శకుడు. ఈ సినిమా ఈ నెల 19న రిలీజ్‌కు రాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. డైరెక్టర్ మురళీ మనోహర్ మాట్లాడుతూ,’ తెలుగు ఆడియెన్స్‌కు ఒక కొత్త తరహా సినిమా చూపించాలనే అందరం ఎఫర్ట్స్ పెట్టాం. కొత్త తరహా సినిమా అని ఎక్కడా మన నేటివిటీ దాటి వెళ్లలేదు’ అని తెలిపారు.’మా మూవీ బాగా వచ్చిందంటే అందుకు కారణం మా డైరెక్టర్ మురళీ. మొదటి నుంచి అతను మాకు చెబుతూనే ఉన్నాడు. ఈ సినిమాతో మిమ్మల్ని గర్వపడేలా చేస్తానని. చెప్పినట్లే ట్రైలర్‌తో ప్రూవ్ చేశాడు. మా ట్రైలర్ చూసిన యూఎస్ మిత్రులు, డిస్ట్రిబ్యూటర్స్ కంటెంట్ గురించే మాట్లాడుతున్నారు.
అలాగే బ్రహ్మానందం ప్రతి సందర్భంలో మమ్మల్ని సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. యోగి బాబు క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది’ అని ప్రొడ్యూసర్ అమర్ బురా చెప్పారు. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ, ‘ఈ సినిమాలో సౌధామిని క్యారెక్టర్‌లో మీ ముందుకు వస్తున్నాను. ఒక డిఫరెంట్ డార్క్ కామెడీ చిత్రమిది’ అని తెలిపారు. ‘లీడ్ రోల్ చేసే అవకాశం రావడం హ్యాపీగా ఉంది’ అని హీరో నరేష్ అగస్త్య చెప్పారు. బ్రహ్మానందం మాట్లాడుతూ,’నేను ఇంపార్టెంట్ రోల్ చేశాను. కథను ప్రేక్షకులకు తెలియజేసే జడ్జి పాత్రలో నటించాను. ఇదొక డిఫరెంట్ స్టోరీ. ఈ చిత్రాన్ని ఇప్పటి ప్రేక్షకులకు నచ్చేలా కొత్త పద్ధతిలో దర్శకుడు మురళీ మనోహర్ తెరకెక్కించాడు. యోగి బాబు పాత్ర స్పెషల్ అట్రాక్షన్‌గా ఉంటుంది. ప్రొడ్యూసర్స్ సినిమా బాగా వచ్చేలా రాజీ పడకుండా నిర్మించారు. కొత్త వాళ్లు చేసిన ఇలాంటి చిత్రాలను ఆదరిస్తే ఇండస్ట్రీ బాగుంటుంది’ అని అన్నారు.
సరికొత్త డార్క్ కామెడీ చిత్రం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



