Tuesday, January 20, 2026
E-PAPER
Homeసినిమాసరికొత్తగా 'డియర్‌ ఆస్ట్రోనాట్‌'

సరికొత్తగా ‘డియర్‌ ఆస్ట్రోనాట్‌’

- Advertisement -

మనస్విని భాగ్యరాజా సమర్పణలో యువన్‌ కష్ణ ఎంటర్టైన్మెంట్స్‌ పతాకం పై నిజ జీవితంలో భార్య భర్తలైన వరుణ్‌ సందేశ్‌, వితికా షేరు హీరో, హీరోయిన్లుగా కార్తీక్‌ భాగ్యరాజా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘డియర్‌ ఆస్ట్రోనాట్‌’. ఈ చిత్ర తొలిపోస్టర్‌ను ఇటీవలే విడుదల చేశారు.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ సభ్యులు మాట్లాడుతూ, ‘చిన్నప్పటి నుంచి అంతరిక్షంలోకి వెళ్లాలని, నక్షత్రాల మధ్య విహరించాలని కలలు కనే ఒక మహిళ కథే ఈ చిత్రం. ఆకాశమే హద్దుగా తాను ఆస్ట్రోనాట్‌ అవ్వాలనే లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆమె ఎదుర్కొన్న సవాళ్లు, చేసిన పోరాటమే ఈ చిత్ర కథాంశం.ఇదొక ఇన్స్పిరింగ్‌ కథ, చాలా కొత్తగా ఉంటుంది. వరుణ్‌ సందేశ్‌, వితికా షేరు అద్భుతంగా నటిస్తున్నారు. కార్తీక్‌ కొడకండ్ల సంగీతం అందిస్తున్నారు. మంచి నిర్మాణ విలువలత,ో సరికొత్త కథ, కథనంతో ఈ సినిమాని త్వరలోనే రిలీజ్‌ చేయబోతున్నాం’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -