Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeసినిమాసరికొత్త ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌

సరికొత్త ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌

- Advertisement -

‘నువ్విలా, జీనియస్‌, రామ్‌ లీలా, సెవెన్‌’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో హవీష్‌, ‘సినిమా చూపిస్త మావ, నేను లోకల్‌, ధమాకా, మజాక’ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాల దర్శకుడు నక్కిన త్రినాథరావు కాంబోలో రూపొందుతున్న మూవీ ‘నేను రెడీ’.
ఈ చిత్రాన్ని హార్నిక్స్‌ ఇండియా ఎల్‌ఎల్‌పి బ్యానర్‌ పై నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు. కావ్య థాపర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.
బ్రిలియంట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కు తున్న ఈ మూవీ నుంచి ఇటీవల రిలీజ్‌ చేసిన హీరోయిన్‌ కావ్య థాపర్‌ బర్త్‌ డే పోస్టర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఈ చిత్రంలో ఆమె క్యారెక్టర్‌ ప్రేక్షకుల్ని ఆకట్టుకోనుంది.
ఈ మూవీ తన కెరీర్‌లో ది బెస్ట్‌గా నిలుస్తుందని ఆశిస్తోంది కావ్య థాపర్‌.
ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ మూవీకి మంచి అవుట్‌ పుట్‌ వస్తోంది. ఇటీవల రిలీజ్‌ చేసిన టైటిల్‌ గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో మరింత కాన్ఫిడెంట్‌గా చిత్రీకరణ జరుపుతున్నామని మేకర్స్‌ తెలిపారు.
శ్రీలక్ష్మి, గోపరాజు రమణ, హరి తేజ, మహతి, రూప లక్ష్మి, జయవాణి, మాణిక్‌ రెడ్డి, బలగం, సత్యనారాయణ, రోహన్‌ రారు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్‌ – రామకష్ణ, ఎడిటర్‌ – ప్రవీణ్‌ పూడి, డీవోపీ – నిజార్‌ షఫ,ీ
సంగీతం – మిక్కీ జే మేయర్‌.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad