Wednesday, June 4, 2025
E-PAPER
Homeసినిమాసరికొత్త ప్రేమకథ

సరికొత్త ప్రేమకథ

- Advertisement -

పాన్‌ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న చిత్రం ‘8 వసంతాలు’. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన కాన్సెప్ట్‌-సెంట్రిక్‌ మూవీ ఇది. అనంతిక సనీల్‌కుమార్‌ లీడ్‌ రోల్‌ పోషించారు. నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మించిన ఈ సినిమా ఈనెల 20న థియేటర్లలో విడుదల కానుంది. హదయాన్ని కదిలించే ప్రేమగాథ మరో మూడు వారాలలో ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచబోతోంది అని చిత్ర యూనిట్‌ తెలిపింది. రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌లో అనంతిక సనీల్‌కుమార్‌ బ్యూటీఫుల్‌గా ఉన్నారు. అద్భుతమైన చీరలో ఆమె ప్లజెంట్‌గా కనిపించారు. వరుస మ్యూజికల్‌ హిట్స్‌ని అందిస్తున్న హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌ ఈ చిత్రానికి మ్యూజిక్‌ సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్‌ పరంగా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. విశ్వనాథ్‌ రెడ్డి డీఓపీగా వర్క్‌ చేస్తున్నారు. అరవింద్‌ ములే ప్రొడక్షన్‌ డిజైన్‌ను, శశాంక్‌ మాలి ఎడిటింగ్‌ను పర్యవేక్షిస్తున్నారు. హనురెడ్డి, రవితేజ దుగ్గిరాల, సంజన, కన్నా, స్వరాజ్‌ రెబ్బాప్రగడ, సమీరా కిషోర్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: ఫణీంద్ర నర్సెట్టి, నిర్మాతలు: నవీన్‌ యెర్నేని, వై రవిశంకర్‌, సిఇఓ : చెర్రీ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: బాబాసాయి కుమార్‌ మామిడిపల్లి, యాక్షన్‌ కొరియోగ్రఫీ: వింగ్‌ చున్‌ అంజి. ‘ఇప్పటివరకు ఎన్నో ప్రేమకథా చిత్రాలు వచ్చాయి. వాటితో పోలిస్తే ఈ సినిమా చాలా భిన్నంగా ఉంటుంది. సరికొత్తగా ఉండే ప్రేమకథ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఇందులో లీడ్‌ రోల్‌లో నటించిన అనంతిక సనీల్‌కుమార్‌ నటన అందర్నీ మెస్మరైజ్‌ చేస్తుంది’ అని నిర్మాతలు నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -