భిన్న పాత్రలతో విలక్షణ నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న చైతన్యరావు మాదాడి కథానాయకుడిగా రూపొందుతున్న రా అండ్ రూటెడ్ ఫిల్మ్ ‘దిల్ దియా’ ఏ నేక్డ్ ట్రూత్’ అనేది ట్యాగ్‌లైన్. కె.క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఈచిత్రాన్ని శ్రియాస్ చిత్రాస్, ఎ. పూర్ణ నాయుడు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై పూర్ణ నాయుడు నిర్మిస్తున్నారు. చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా విడుదల చేసి, చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఈ సినిమా భావోద్వేగాలు, వ్యక్తిగత సంబంధాల మధ్య వచ్చే సంఘర్షణలను చూపించే ట్రెండింగ్ డ్రామాగా ఉండబోతుంది. కె. క్రాంతి మాధవ్ ఇప్పటి వరకు చేసిన భావోద్వేగాత్మక సినిమాల ప్రయాణానికి కొనసాగింపులానే ఉంటుంది. ఆయన తన సినిమాల్లో ఎమోషన్స్‌లో డెప్త్‌తో పాటు బలమైన కథలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు.
ఆయన తెరకెక్కించిన ‘ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, వరల్డ్ ఫేమస్ లవర్’ వంటి సినిమాలను గమనిస్తే.. ప్రేమ, మనసుల్లోని భావాలు, అంతర్గత సంఘర్షణలు పాత్రల రూపంలో స్పష్టంగా కనిపిస్తాయి. ఈ సినిమా ఈ ఏడాది వేసవిలో థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. యువతను దృష్టిలో పెట్టుకొని, లోతైన భావోద్వేగాలతో కూడిన ప్రేమకథగా ఈ మూవీ రూపొందుతోంది. ఆధునిక సంబంధాలను నిజాయితీగా, ఎలాంటి ఫిల్టర్ లేకుండా చూపించేలా సినిమా రూపొందుతోంది. ఇరా, సఖి, జెస్సీ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రానికి సహ నిర్మాత : శ్రీకాంత్ వి, సినిమాటోగ్రఫీ : పి.జి.విందా, సంగీతం : ఫణి కళ్యాణ్‌చ, ఎడిటర్ : రా-షా (రవి-శశాంక్), ప్రొడక్షన్ డిజైనర్ : చిన్నా.
సరికొత్త ప్రేమకథా చిత్రం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



