- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పరిధిలోని సులేమాన్ నగర్‌లో న్యాయవాది మహమ్మద్ ఖదీర్ దారుణ హత్యకు గురయ్యారు. తన సొంత కార్యాలయంలో ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కుటుంబ విభేదాల నేపథ్యంలో బామ్మర్దులే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



