Wednesday, March 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజల ఆర్థిక, సామాజిక, సమస్యలకు పరిష్కారం చూపని బడ్జెట్

ప్రజల ఆర్థిక, సామాజిక, సమస్యలకు పరిష్కారం చూపని బడ్జెట్

- Advertisement -

– ఎస్ వీరయ్య సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు.
నవతెలంగాణ-భువనగిరి : 2026 – 2027 వార్షిక సంవత్సరం బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టడం జరిగింది ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆర్థిక సామాజిక రాజకీయ సమస్యలను పరిష్కారం చూపని బడ్జెట్ గా ఉందని సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య అన్నారు. బుధవారం స్థానిక సుందరయ్య భవనంలో వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు దుంపల మల్లారెడ్డి 20వ వర్ధంతి సందర్భంగా దుంపల మల్లారెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పరిశీలన స్మారక ఉపన్యాసంలో వారు మాట్లాడుతూ
అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ అంబేద్కర్ చెప్పిన విధంగా తెలంగాణ రాష్ట్రానికి పాలకులుకా కాదు సేవకులుగా ఉంటామని మాట్లాడడం జరిగింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల కాలంలో పేద ప్రజల సమస్యలు ఏ బడ్జెట్ లోను పరిష్కారం కాలేదు గత సంవత్సరం వార్షిక బడ్జెట్ కంటే ఈ సంవత్సరం వార్షిక బడ్జెట్ కేవలం 20 వేల కోట్లు మాత్రమే పెంచడం రాష్ట్ర ప్రజల జీవన స్థితిగతులు పేదరికం ఏ రకంగా మారుతుందని ప్రశ్నించారు. పెరిగిన ధరలను అంచనావేసి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దానికి సరిపోదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఏ పథకానికి బడ్జెట్ పెంచాలి ఏ పథకానికి తగ్గించాలి అనే అంచనా లేదని విమర్శించారు టిఆర్ఎస్ బడ్జెట్ కు ప్రస్తుత కాంగ్రెస్ బడ్జెట్ కు ఏ మాత్రం మౌలిక తేడా లేదన్నారు. దళితులకు కేటాయించవలసిన బడ్జెట్ 4 వేల కోట్లు తగ్గించారు. అని విద్యా వైద్య రంగాలకు పెద్దగా బడ్జెట్ కేటాయింపు ఈ సంవత్సరం జరగలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల వేతనాల పెంపు పై బడ్జెట్లో ఎలాంటి అంశం లేదని వ్యవసాయానికి కౌలు రైతులకు బడ్జెట్లో ఎలాంటి కేటాయింపు లేదన లేదన్నారు. అధికారంలోకి రాకముందు సంవత్సరానికి రూ. 12 వేల ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు కానీ దానికి బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపు జరగలేదన్నారు. బీడీ కార్మికులకు చేనేత కార్మికులకు బడ్జెట్లో ఊసే లేకుండా ఉందని, ఇల్లు లేని పేదలకు రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపు అంతంత మాత్రమే ఉందని రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మందికి ఇల్లు లేవని ప్రభుత్వమే గుర్తించిందన్నారు. వారికి కేటాయించింది మాత్రం ఏమిటని ప్రశ్నించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఆదాయంతో ఖర్చుతో సంబంధం లేకుండా బడ్జెట్ పెట్టారని శ్వేత పత్రాన్ని విడుదల చేయడం జరిగిందన్నారు. దీన్ని గమనించిన రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల పేదరికాన్నీ అంచనా వేసి బడ్జెట్ కేటాయింపు ఉంటుందని అనుకున్నారు. కానీ బడ్జెట్ కేటాయింపు మాత్రం ఏ మాత్రం ప్రజల జీవన విధానాలకు దగ్గరగా లేదని వారు అన్నారు. అదేవిధంగా నిరుద్యోగ యువతను మోసం చేసే విధంగా ఏటా రెండు లక్షల మాట ఉసే లేకుండా పోయిందన్నారు. రాజీవ్ యువ వికాస్ పథకానికి కేటాయింపు నామమాత్రంగా ఉందని వారు అన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో జిల్లాకు తీవ్రంగా అన్యాయం జరిగిందని వారు అన్నారు. బీబీనగర్ ఏమ్స్ బస్వాపూర్ రిజర్వాయర్ పిల్లాయిపళ్లి గంధమల్ల బునాదిగాని ధర్మారెడ్డిపల్లి భీమలింగం ఆసిఫ్ నహర్ కాలువల మరమ్మత్తులకు కేటాయింపు లేదని, రోడ్ల వెడల్పుకు ఏ మాత్రం బడ్జెట్ కేటాయింపు జరగలేదన్నారు. జిల్లా మంత్రులు శాసనసభ్యులు జిల్లా అభివృద్ధి కొరకు బడ్జెట్ కోరడంలో పూర్తిగా విఫలమయ్యాన్నారు. వీరితోపాటు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, బూరుగు కృష్ణారెడ్డి, గుంటూజు శ్రీనివాసచారి, జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దయ్యాల నరసింహ, మాయ కృష్ణ, బోలగాని జయరాములు, ఎంఏ ఇక్బాల్ గడ్డం వెంకటేష్, మండల కార్యదర్శులు పల్లెర్ల అంజయ్య, పోతరాజు జహంగీర్, రేఖల శ్రీశైలం, బండారు శ్రవణ్, ప్రజా సంఘాల నాయకులు ఈర్లపల్లి ముత్యాలు, వడ్డెబోయిన వెంకటేష్, గంధమల్ల మాతయ్య, ఎదునూరి మల్లేష్, ఎండి సలీం, వనం రాజు, మాటూరి కవిత, వల్లపు దాసు రాంబాబు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -