బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఎర్రచీర’ -ది బిగినింగ్.
మదర్ సెంటిమెంట్, హర్రర్ యాక్షన్ అంశాలతో రూపొందిన ఈ చిత్రం ఈనెల 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని కీలక పాత్రలో నటించగా, దర్శకుడు సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్రను కూడా పోషించారు.
సినిమా రిలీజ్ నేపథ్యంలో దర్శకుడు సుమన్‌బాబు మాట్లాడుతూ, ‘ఒక విలక్షణమైన కథాంశంతో రూపొందిన సినిమా. మదర్ సెంటిమెంట్‌కు హర్రర్, యాక్షన్ అంశాలు బలంగా మిళితమయ్యాయి. ఇప్పటికే ఈ చిత్రాన్ని వీక్షించిన డిస్ట్రిబ్యూటర్లు, సెన్సార్ బోర్డు సభ్యులు సినిమా కంటెంట్‌పై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా సినిమాలోని ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయని సెన్సార్ టీమ్ అభిప్రాయపడింది. ఇది ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రం అయినప్పటికీ కుటుంబమంతా కలిసి చూసేలా రూపొందించాం. చింతల్ ప్రాంతంలో నా స్నేహితుడి ఇంటి పక్కన జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ కథను తీసుకున్నా. సీజీ వర్క్ కారణంగా సినిమా విడుదల ఆలస్యమైంది. కారుణ్య చౌదరి పాత్రలో సస్పెన్స్ ఉంటుంది. శ్రీరామ్, కమల్ కామరాజు, అజరు, అయ్యప్ప పి.శర్మ, సుమన్ శెట్టి, జీవా, సురేష్ కొండేటి, రఘుబాబు వంటి దాదాపు 23 మంది నటీనటులు ఉన్నారు. ఇందులో కేవలం 20% మాత్రమే వాస్తవ కథ ఉంటుంది, మిగిలినది కల్పితం. బాబాల గురించి కూడా ఇందులో చూపించా. బి, సి సెంటర్ల థియేటర్లలో ప్రతి షోకి లక్కీ డ్రా తీసి 10 మందికి చీరలను బహుమతిగా ఇవ్వబోతున్నాం. అక్షరు కుమార్ సినిమా ‘భూత్ బంగ్లా’లో పాప పాలు తాగే షాట్‌ను మా సినిమా నుండే కాపీ కొట్టారు. యూత్ కోసం, కమర్షియల్ హంగుల కోసం 36 ముద్దుల కాన్సెప్ట్‌తో ఒక పాటను పెట్టాం. ఎర్రచీరకు సీక్వెల్‌గా అరకులో జరిగిన గిరిజన యదార్థ గాధతో ‘అంబిక (ఎర్రచీర-2)’ సినిమాను కూడా ప్లాన్ చేస్తున్నా. అలాగే ‘రాముడా? కష్ణుడా?’ అనే రొమాంటిక్ కామెడీ సినిమా చేస్తున్నా’ అని అన్నారు.
ప్రేక్షకులకు బంపర్ ఆఫర్
- Advertisement -
- Advertisement -



