Saturday, November 8, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమహిళలతో కిక్కిరిసిన బస్టాండ్...

మహిళలతో కిక్కిరిసిన బస్టాండ్…

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
రక్షాబంధన్ వేళ మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ మహిళలతో కిక్కిరిసిపోయింది. తోబుట్టువులకు రాఖీ కట్టేందుకు పెద్ద ఎత్తున మహిళలు ప్రయాణం చేసేందుకు బస్టాండుకు చేరుకోవడంతో కమ్మర్ పల్లి బస్టాండ్ లో ఎటు చూసినా మహిళలే దర్శనమిచ్చారు. మహిళల ప్రయాణాలకు అనుగుణంగా ఆర్టీసీ అధికారులు సరైన బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్సుల కోసం గంటల కొద్ది మహిళలు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అడపాదనకు వచ్చిన ప్రతి బస్సు కిక్కిరిసి ఫుట్ బోర్డు వరకు ప్రయాణికులు ఉండడంతో ఎక్కెందుకు స్థలం లేక మహిళలు అవస్థలు పడ్డారు. ఎలాగోలా వచ్చిన బస్సును  ఎక్కకపోతే మళ్ళీ బస్సు ఎప్పుడు వస్తాదో అన్న ఆందోళనతో బస్సు ఎక్కెందుకు మహిళలు ఒకరికొకరు తోసేసుకునే పరిస్థితి ఏర్పడింది.ఆర్టీసీ అధికారులు రాఖీ పండుగను క్యాష్ చేసుకునేందుకు రాఖీ స్పెషల్ బస్సు పేరుతో ప్రజలను దోపిడీ చేశారు. పండుగను దృష్టిలో పెట్టుకుని ప్రజల అవసరాల మేరకు బస్సుల్ని ఏర్పాటు చేయకపోవడం పట్ల ఆర్టీసీ అధికారుల తీరుపై మహిళలు అసహన వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -