బైకును ఢకొీట్టిన కారు

A car hit a bike– ఒకరు మతి, కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
నవతెలంగాణ-కొత్తూరు
వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ముందుగా వెళ్తున్న బైక్‌ను ఢకొీట్టడంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మతి చెందిన ఘటన మంగళవారం కొత్తూరు వై జంక్షన్‌ లో చోటుచేసుకుంది. సీఐ శంకర్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్‌నగర్‌ ఎనుగొండకు చెందిన షేక్‌ షియాదత్‌ అలీ తన మారుతి సెలెరియో (నెంబర్‌ టిఎస్‌ 11ఈహెచ్‌ 2447) కారులో హైదరాబాద్‌ వెళుతుండగా మార్గ మధ్యలో కొత్తూరు వై జంక్షన్‌ వద్ద కారు డ్రైవర్‌ నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడంతో అదుపుతప్పి ముందుగా వెళ్తున్న టు వీలర్‌ వాహనాన్ని బలంగా ఢ కొట్టి కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కార్‌ డ్రైవర్‌, బైక్‌ పై వెళుతున్న వ్యక్తి మల్లేష్‌ (45) ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అందులో బైక్‌ నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిరువురుని 108 వాహనంలో శంషాబాద్‌ లోని ట్రీ డెంట్‌ ఆస్పత్రికి తరలించారు. మల్లేష్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో అతన్ని హైదరాబాద్‌ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతన్ని పరిశీలించిన ఉస్మానియా వైద్యులు మార్గమధ్యలోనే చనిపోయినట్లు ధ్రువీకరించారు. మతిని అల్లుడు ఎర్ర నరేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Spread the love