- Advertisement -
నవతెలంగాణ – వనపర్తి
రోడ్డు దాటుతున్న వ్యక్తిని వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొనడంతో ఆయనకు గాయాలయ్యాయి. ఈ సంఘటన కొత్తకోట మండలం పాలెం సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామానికి చెందిన కొండన్న అనే వ్యక్తి పాలెం సమీపంలో జాతీయ రహదారిని దాటుతుండగా కారు ఆయనను ఢీ కొట్టింది. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -