Tuesday, November 11, 2025
E-PAPER
Homeజిల్లాలురోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీ కొట్టిన కారు..

రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీ కొట్టిన కారు..

- Advertisement -

చికిత్స పొందుతూ మృతి..
నవతెలంగాణ – వేములపల్లి 

రోడ్డు దాటుతున్న వ్యక్తిని కారు ఢీ కొట్టిన సంఘటన మండలంలోని శెట్టిపాలెం క్రాస్ రోడ్ వద్ద అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై మంగళవారం చోటు చేసుకుంది. వీరాల్లోకెళ్తే మడుగులపల్లి మండలం బొమ్మకల్లు గ్రామానికి చెందిన అక్కినపల్లి బజారయ్యా(56) బ్యాంకు పని నిమిత్తం శెట్టిపాలెం క్రాస్ రోడ్డు వద్ద బస్సు దిగి రోడ్డు దాటుతుండగా హైదరాబాదు నుండి నెల్లూరు  వెళ్తున్న కారు ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాల పాలైనాడు. వెంటనే స్థానికులు108లో చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. మృతునికి ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నట్లు బంధువులు తెలిపారు. మృతుడు బొమ్మకల్ గ్రామపంచాయతీలో పంపు ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. శాలరీ డబ్బులు డ్రా చేసుకోవడం కోసం మండలంలోని బ్యాంకుకు వెళుతుండగా సంఘటన చేసుకున్నట్లు సమాచారం. ప్రమాద సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -