బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా నాయకులు కొడారి వెంకటేష్ ..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలోని సాయి హోటల్ యాజమాన్యం పై కేసు నమోదు చేయాలని బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా నాయకులు కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బాలల హక్కులకు భంగం కలిగించే విధంగా, బాలలను పనిలో పెట్టుకొని, బాలిక చేత పనులు చేయించడం నేరమన్నారు. బాలిక, ఆర్థిక పరిస్థితిని అవకాశంగా తీసుకుని బాలికను హోటల్ లో పనికి కుదుర్చుకొని, బాలిక చేత కస్టమర్లు తిన్న ప్లేట్లు, గ్లాసులు, మద్యం సీసాలను తీయించడం నేరమని తెలిసినా, చట్ట విరుద్ధంగా బాలలను పనిలో పెట్టుకొన్న నాగిరెడ్డిపల్లి లోని సాయి హోటల్ యాజమాన్యం పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బాలికను బాల సదనంలో చేర్పించి, బడికి పంపాలని ఆయన కోరారు.
సాయి హోటల్ యాజమాన్యంపై కేసు నమోదు చేయాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES