Thursday, October 2, 2025
E-PAPER
Homeజాతీయంఆర్‌ఎస్‌ఎస్‌కు 'శతాబ్ది' కానుక

ఆర్‌ఎస్‌ఎస్‌కు ‘శతాబ్ది’ కానుక

- Advertisement -

తపాల బిళ్ల, నాణేం విడుదల
సేవా సంస్థగా ప్రధాని మోడీ గొప్పలు

న్యూఢిల్లీ : భారత స్వాతంత్య్ర సంగ్రామోద్యమంలో ఇసుమంత పాత్ర కూడా లేని సంస్థ, ప్రజలను మతం, కులాల ఆధారంగా విభజించి విద్వేష జాఢ్యాన్ని పెంచి పోషించే సంస్థను ప్రపంచంలోనే అతిపెద్ద సేవా సంస్థగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసలు గుప్పించారు. ఎర్రకోటపై స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగానికి కొనసాగింపుగా రాష్ట్రీయ స్వయం సేవక్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌)పై ఆయన తన స్వామిభక్తిని చాటుకున్నారు. న్యూఢిల్లీలోని బీఆర్‌ అంబేద్కర్‌ అంతర్జాతీయ కేంద్రంలో ఆ సంస్థ శతాబ్ది ఉత్సవాల వేడుకల్లో మోడీ పాల్గొన్నారు. భారత రాజ్యాంగాన్ని ఏనాడూ గౌరవించని, అస్సలు ఆమోదించేందుకు కూడా మనస్కరించని ఆర్‌ఎస్‌ఎస్‌ పేరుతో స్మారక తపాలా బిళ్లను, రూ.100 నాణేన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ..తాజాగా విడుదల చేసిన రూ.100 నాణెంపై ఓవైపు జాతీయ చిహ్నం.. మరోవైపు భారతమాత చిత్రం ఉందని, స్వతంత్ర భారతదేశ చరిత్రలో మన కరెన్సీపై భరతమాత ఉండటం ఇదే తొలిసారి అని ఆయన పేర్కొన్నారు. పేదల జీవితాల్లో మార్పు కోసం ఆర్‌ఎస్‌ఎస్‌ కషి చేస్తోంద న్నారు.

అనేక రంగాలకు విస్తరించినా విభేదాల రహితంగా, ఐక్యంగా ఆర్‌ఎస్‌ఎస్‌ నిలబడిందని, ‘దేశమే ముందు’ అనేది ఆర్‌ఎస్‌ఎస్‌ నినాదమని, అందువల్లే ఇది సాధ్యమైందని ఆయన చెప్పారు. గతంలో ఆర్‌ఎస్‌ఎస్‌ను అణచివేసేందుకు తప్పుడు కేసులు బనాయించడం, నిషేధించడం వంటి ప్రయత్నాలు జరిగాయని, వాటిని అన్నింటినీ తట్టుకొని నిలబడిందని మోడీ గొప్పలు చెప్పారు. మహాత్మాగాంధీని ఆర్‌ఎస్‌ఎస్‌ నేత నాథూరాం గాడ్సే హత్య చేసిన నేపథ్యంలో ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి తన ప్రసంగం అసాంతం ఆర్‌ఎస్‌ఎస్‌పై ఉన్న మరకలను చెరిపేసి.. దానిని ఒక దేశభక్తియుత సంస్థగా చిత్రీకరించేందుకు ప్రయత్నించా రని ప్రతిపక్షాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ ఐక్యతకు కృషి చేసిన యోధుడిగా ప్రధాని మోడీ భావించే సర్దార్‌ వల్లబారుపటేల్‌ సైతం ఆర్‌ఎస్‌ఎస్‌ను, దాని భావజాలాన్ని తిరస్కరించారని ఈ సందర్భంగా మోడీకి గుర్తు చేశారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఏమాత్రం పాత్ర లేని సంస్థ కార్యకర్తలను ఏకంగా గణతంత్ర పరేడ్‌లో పాల్గొన్నట్టు ఒక పోస్టల్‌ స్టాంప్‌ విడుదల చేయడం దారుణమని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -