Wednesday, December 24, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్సహకారానికి చెక్‌

సహకారానికి చెక్‌

- Advertisement -

ఎన్నికలకు బదులు పాలకమండళ్ల నియామకం
రైతులపై బలవంతంగా రుద్దడమే
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ప్రాథమిక సహకార సంఘాల స్వయం పాలనకు రాష్ట్ర ప్రభుత్వం ఎసరు పెడుతోంది. ప్రజాస్వా మ్యయు తంగా సొసైటీ ఎన్నికలు నిర్వహిం చాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వాటిల్లోని పదవులను నామినేటెడ్‌ పద్ధతిలో నియమిం చాలని భావిస్తోంది. రైతుల కష్టార్జితంతో ఏర్పడిన ఆ సంఘాలు ఇప్పుడు రాజకీయ వేదికలుగా మారబో తున్నాయి. సహకార సంఘాల్లో ప్రభుత్వ పాత్ర కేవలం ఎన్నికలను నిర్వహించడం, ఎన్నికైన సభ్యులకు పాలకవర్గ బాధ్యతలు అప్పగించడమే పని. వీటిలో రైతులు స్వయం పాలన సాగిస్తారు. వారికి కావాల్సిన నిర్ణయాలను వారు తీసుకుంటారు. ఈ కోణంలోనే ప్రాథమిక సహకార చట్టం ఏర్పడింది. దాని బలోపేతానికి 63 సవరణలు కూడా జరిగాయి. ముఖ్యంగా వైఎస్‌ రాజశేఖరెడ్డి హయాంలో వీటిలో ప్రభుత్వ జోక్యం లేకుండా చట్టాన్ని తీసుకొచ్చారు. ఆయా సంఘాల్లో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించడం ద్వారా 13 మంది సభ్యులను ఎన్నుకుంటారు. ఇందులో చైర్మెన్లు, వైస్‌ చైర్మెన్లు కలిపి పాలకమండళ్లు ఏర్పాట వుతున్నాయి. తమ బలాన్ని బట్టి అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయ కులకు అందులో ప్రాతినిధ్యం దక్కు తుంది.

సహకార వ్యవస్థపై రాజకీయ పట్టు కోసమేనా?
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్‌), జిల్లా సహకార బ్యాంకులు (డీసీసీబీ), రాష్ట్ర సహకార బ్యాంకు (ఎస్‌సీబీ) వంటి సంస్థలు రైతుల స్వయం పాలనకు ప్రతీకలుగా నిలిచాయి. కానీ తాజాగా వీటి చైర్మెన్లను రాష్ట్ర ప్రభుత్వం నేరుగా నియమించాలనే నిర్ణయంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల ద్వారా రావాల్సిన పదవులు ప్రభుత్వ చేతికి వెళ్లడం సహకార వ్యవస్థ స్పూర్తికి విరుద్ధమనే విమర్శలు వినిపిస్తున్నాయి. సహకార బ్యాంకులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రుణాలు, సబ్సిడీలు, ప్రభుత్వ పథకాలు అన్నీ వీటి ద్వారానే అమలవుతాయి. ఇలాంటి కీలక సంస్థలపై అధికార పార్టీకి పూర్తి పట్టు వస్తే, గ్రామ స్థాయిలో రాజకీయ ఆధిపత్యం పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఎన్నికల సమయంలో ఇది అధికార పార్టీకి అదనపు ఆయుధంగా మారే అవకాశముందని ఆందోళన చెందుతున్నారు.
ప్రజాస్వామ్యానికి విరుద్ధం :టి సాగర్‌, తెలంగాణ రైతు సంఘం
సహకార సంఘాల పాలకమండళ్లను నామినేట్‌ చేయడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం. అదే జరిగితే, వ్యక్తుల ప్రాబల్యం పెరుగుతుంది. రైతుల ప్రయోజనాల కంటే పార్టీల ప్రయోజనాలే ఎక్కువగా ఉంటాయి. ఈ ఆలోచనను ప్రభుత్వం ఉపసంహరిం చుకోవాలి. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించాలి.

సభ్యుల హక్కులను హరించడమే :దొంతి నర్సింహరెడ్డి, వ్యవసాయ విధాన విశ్లేషకులు
సహకార సంఘాల పాలక మండళ్లను సర్కారు నామినేట్‌ చేయడం సరైందికాదు. అది సభ్యుల హక్కులను హరించడమే. ఈ ఎన్నికల్లో డబ్బు, మద్యంతోపాటు ఘర్షణలు పెరుగుతాయని చెప్పడం సాకు మాత్రమే. అది ప్రభుత్వ సంస్థ కాదు…ప్రజా సంస్థగా ఉండాలి.

కొరివితో నెత్తి గోక్కున్నట్టే :సంబారపు భీమయ్య, సహకార ధర్మపీఠం
రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే, అది కొరివితో నెత్తి గోక్కున్నట్టే. పాలకవర్గాలను నామినేట్‌ చేసే హక్కు ప్రభుత్వానికి లేదు. అధికార పార్టీ నాయకులకు పదవులు ఇవ్వడమే. ఇదే జరిగితే రైతుల్లో తీవ్రమైన అసంతృప్తి పెరుగుతోంది.

ఒక రూపాయి కూడా ప్రభుత్వానిది లేదు
కొండూరు రవీందర్‌రావు, డీసీసీబీ చైర్మెన్‌ కరీంనగర్‌

సహకార సంఘాల్లో ఒక రూపాయి కూడా ప్రభుత్వానిది లేదు. చట్టాల ప్రకారం రైతుల సొమ్ముతో సంఘాలు ఏర్పడ్డాయి. కానీ తమ కార్యకర్తలకు పదవులు ఇవ్వడం కోసం నామినేట్‌ చేయడం సరైందికాదు. ఈ చట్టం వైఎస్‌ హయాంలో బలోపేతమైంది.

ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు
రైతులకు దెబ్బే
చైర్మెన్లు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తే, రుణాల మంజూరు, వసూళ్లలో పక్షపాతం చోటు చేసుకునే ప్రమాదం ఉందన్న ఆందోళన రైతుల్లో ఉంది. సహకార సంఘం అంటే రైతుల సంఘం. కానీ ఇప్పుడు అది ‘ప్రభుత్వ శాఖలా’ మారుతోందన్న భావన బలపడుతోంది. రాజ్యాంగంలో సహకార సంస్థల స్వయం పాలనకు ప్రాధాన్యత ఉన్నది. ఈ అంశాన్ని 1997లో ప్రాథమిక హక్కుల్లో చేర్చారు. దీని ప్రకారం ఎన్నికల ద్వారా పాలక మండళ్లను ఎన్నుకోవాలి. దానికి భిన్నంగా నామినేటెడ్‌ పదవులను తమకు ఇష్టం వచ్చిన వారికి ఇవ్వడాన్ని చట్టం ఒప్పుకోదని కొంత మంది చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోర్టుల్లో వీగిపోతుందని మరికొంత మంది భావిస్తున్నారు. చైర్మెన్లను నామినేట్‌ చేస్తే అది స్వయం పాలనను నిర్వీర్యం చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్షాలు దీన్ని ప్రజాస్వామ్య హక్కుల హననంగా అభివర్ణిస్తున్నాయి.

ప్రభుత్వ వాదన ఏంటి?
సహకార సంఘాల్లో అక్రమాలు, నష్టాలు, పాలనా లోపాలు ఉన్నాయన్న కారణంతో ప్రభుత్వం నామినేటెడ్‌ నియామకాల వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. రైతులకు అందనున్న సంక్షేమ ఫలాలను రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధంగా అందించడం, వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడమే లక్ష్యంగా ముందుకు పోతున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆ వాదనలను ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -