నవతెలంగాణ – తుంగతుర్తి
పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతల దృష్ట్యా,ప్రజల దాహాన్ని తీర్చేందుకు చలివేంద్రం ప్రారంభించినట్లు మండల పరిధిలోని రావులపల్లి గ్రామ సర్పంచ్ చింతకుంట్ల మనోజ్ అన్నారు. ఈ మేరకు వేసవి కాలంలో గ్రామ ప్రజలకు స్వల్ప ఉపశమనాన్ని అందించేందుకు,బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. ప్రతి రోజూ తాగునీటిని అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం” అని తెలిపారు.
చలివేంద్రం ఏర్పాటు వల్ల ప్రయాణికులు,కూలీలు,రైతులు,వృద్ధులతో సహా గ్రామస్థులకు ఉపయోగపడుతుందని అన్నారు.ఈ వేసవిలో ప్రతి ఒక్కరూ ఎక్కువగా నీటిని తీసుకోవాలని,వేడిమి కారణంగా జ్వరం, డీహైడ్రేషన్,అలసట వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని,అందువల్ల చలివేంద్రం ద్వారా ప్రజలకు చల్లని నీరు అందించి,వారి ఆరోగ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాం అని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కేతిరెడ్డి గోపాల్ రెడ్డి,ఉపసర్పంచ్,పంచాయతీ సభ్యులు,గ్రామ పెద్దలు,యువకులు,వివిధ రాజకీయ,సామాజిక సంఘాల నాయకులు,రైతులు,తదితరులు పాల్గొన్నారు.



