Thursday, January 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రజా సమస్యల పరిష్కారానికి దిక్సూచి

ప్రజా సమస్యల పరిష్కారానికి దిక్సూచి

- Advertisement -

– ‘నవతెలంగాణ’ను ఆదరించే ప్రతి ఒక్కరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
– 2026 క్యాలెండర్‌, డైరీని ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి

‘నవతెలంగాణ’ దినపత్రిక సరికొత్త తెలంగాణకు నాంది కావాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో దిక్సూచిగా ఉంటోందని రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అనుదినం జనస్వరమై విరాజిల్లుతున్న ఈ పత్రిక మరింత పురోగతి సాధించాలని ఆకాంక్షించారు. ఖమ్మంలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డితో కలిసి బుధవారం ‘నవతెలంగాణ’ దినపత్రిక క్యాలెండర్‌, డైరీని ఆవిష్కరించారు. చక్కగా ఆకర్షనీయంగా క్యాలెండర్‌, డైరీలు ఉన్నాయని ప్రశంసించారు. ప్రతి అక్షరం ప్రజల పక్షమై.. ప్రజా సమస్యలను వెలికితీయటంలో తనదైన ఒరవడిని కొనసాగిస్తున్న నవతెలంగాణ మునుముందుకు సాగాలని ఆకాంక్షించారు. పత్రికా యాజమాన్యం, సిబ్బంది, పాఠకులు, ప్రకటనకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026లో రాష్ట్ర ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో మరింతగా ముందుకెళ్లాలనే విశ్వాసం వ్యక్తం చేశారు. తమను కలిసిన పత్రికా సిబ్బందికి మంత్రితోపాటు ఎంపీ శుభాకాంక్షలు చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ ఉమ్మడి జిల్లా నాయకులు తుళ్లూరి బ్రహ్మయ్య, బర్రా రాజశేఖర్‌, ఆళ్ల మురళి, నవతెలంగాణ రీజినల్‌ మేనేజర్‌ ఎస్డీ జావీద్‌, ప్రాంతీయ ప్రతినిధి కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి, సిబ్బంది ఇరుగు వెంకటేశ్వర్లు, లింగా వీరారెడ్డి, విలేకరులు గరిడేపల్లి వెంకటేశ్వర్లు, షకీల్‌, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -