Monday, January 19, 2026
E-PAPER
Homeసినిమాపక్కా మాస్‌ సినిమా

పక్కా మాస్‌ సినిమా

- Advertisement -

సన్‌ రైజ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, రవి ఆర్ట్స్‌ బ్యానర్లపై నిర్మాతలు స్వాతిసుధీర్‌, డాక్టర్‌ రవి బాల నిర్మిస్తున్న సినిమా ‘రామ్‌ భజరంగ్‌’. రాజ్‌ తరుణ్‌, సందీప్‌ మాధవ్‌ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాకు సి.హెచ్‌.సుధీర్‌ రాజు దర్శకత్వం వహిస్తున్నారు.
మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. తాజాగా ఈ చిత్ర గ్లింప్స్‌ రిలీజ్‌ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా హీరో సందీప్‌ మాధవ్‌ మాట్లాడుతూ,’ఈ గ్లింప్స్‌ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను’ అని చెప్పారు. మరో హీరో రాజ్‌ తరుణ్‌ మాట్లాడుతూ,’ఈ సినిమాలో నేను చాలా డిఫరెంట్‌ లుక్‌లో కనిపించబోతున్నాను. డైరెక్టర్‌ సుధీర్‌ రాసుకున్న స్క్రిప్ట్‌ చాలా బాగుంది’ అని తెలిపారు. ‘ఒక మంచి మాస్‌ సినిమా ఇది. మణిశర్మ సంగీతం, అజయన్‌ విన్‌సెంట్‌ కెమెరా వర్క్‌ ఈ సినిమాకు హైలెట్‌’ అని డైరెక్టర్‌ సుధీర్‌ రాజు చెప్పారు.
నిర్మాత స్వాతి సుధీర్‌ మాట్లాడుతూ,’రాజ్‌ తరుణ్‌ చేస్తున్న 25వ సినిమా ఇది. సందీప్‌ మాధవ్‌కు ఈ సినిమా మరో బిగ్గెస్ట్‌ హిట్‌ అవుతుంది’ అని తెలిపారు. ‘ఈ సినిమాతో రాజ్‌ తరుణ్‌, సందీప్‌ మాధవ్‌ ఆడియన్స్‌ను బాగా ఎంటర్టైన్‌ చేస్తారు. డైరెక్టర్‌ సుధర్‌ రాజ్‌ చాలా బాగా డైరెక్ట్‌ చేశారు. వెంకట్‌ పాత్ర గురించి అందరూ మాట్లాడుకుంటారు’ అని నిర్మాత రవి బాల చెప్పారు. 1980 బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ సినిమాని ఈ ఏడాది ఐదు భాషల్లో (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ) విడుదల చేయడానికి మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -