లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ జంటగా ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్ల మీద నాగ మోహన్ నిర్మించిన చిత్రం ‘సతీ లీలావతి’. తాతినేని సత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మార్చి 6న రిలీజ్ చేయబోతున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్‌కు సంబంధించిన ఓ ఈవెంట్‌ను నిర్వహించారు. లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ,’ ఈ సినిమా ప్రారంభించినప్పుడు నేను గర్భవతిని. కేవలం మూడు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేశాను. దర్శక, నిర్మాతల సపోర్ట్ వల్లే చేయగలిగాను. సప్తగిరితో పని చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో గొప్ప ఆర్టిస్టులు నటించారు. దేవ్ మోహన్ నటన అందరినీ ఆకట్టుకుంటుంది.
ఇది పూర్తిగా వినోదాత్మక చిత్రం. ఈ మూవీ అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు. ‘కమల్ హాసన్ చేసిన ‘సతీ లీలావతి’తో మాత్రం నా సినిమాని పోల్చను. అందరూ రిలీట్ అయ్యేలా.. అందరికీ కనెక్ట్ అయ్యేలా ఈ సినిమాను తీశాం’ అని దర్శకుడు తాతినేని సత్య చెప్పారు. నిర్మాత నాగ మోహన్ మాట్లాడుతూ, ‘నిర్మాతగా నాకు ఇది మొదటి చిత్రం. మార్చి 6న మా మూవీని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నాం’ అని తెలిపారు. సప్తగిరి మాట్లాడుతూ,’పాత ‘సతీ లీలావతి’ ఎంత పెద్ద హిట్ అయిందో మా సినిమా కూడా అంతే హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు.
పూర్తి వినోదాత్మక చిత్రం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



