మనిషి శరీరం అద్భుతమైన యంత్రం లాంటిది. ఇది శక్తివంతమైన స్వీయ నయం చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది. కానీ ఆధునిక జీవితంలో భావనాత్మక, మానసిక ఒత్తిడి (Emotional & Psychological Stress) సాధారణ సమస్యగా మారింది. ఈ ఒత్తిడి కేవలం మనస్సుపై మాత్రమే కాకుండా, శరీరంలోని జీవక్రియలను కూడా ప్రభావితం చేస్తుంది. ఎమోషనల్, మానసిక ఒత్తిడితో శరీరం క్రమంగా బలహీన పడుతుంది. ఇది శరీరంలోని ఇమ్యూన్ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా క్రానిక్ ఇన్‌ఫ్లమేషన్, (Chronic Inflammation), ఆ తర్వాత అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీస్తుంది. ఈ వ్యాసంలో ఎలా ఒత్తిడి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుంది, సమగ్ర వైద్యం(Integrative Medicine)ఈ సమస్యలకు ఎలా సమగ్ర పరిష్కారాన్ని అందిస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం.
భావనాత్మక ఒత్తిడి, క్రానిక్ ఇన్‌ఫ్లమేషన్ (Chronic Inflammation), మనస్సు, శరీరం అనుసంధానించబడి ఉంటాయి. ఒత్తిడి సమయంలో, శరీరంహొహైపోథలమిక్- పిట్యూటరీ- అడ్రినల్ ద్వారా కార్టిసోల్, అడ్రినలిన్ వంటి హార్మోన్లను విడుదల చేస్తుంది. ఈ ప్రక్రియహొఫైట్-ఆర్-ఫ్లైట్ (Fight-or-Flight) హొప్రతిస్పందనలో భాగం. అయితే,హొదీర్ఘకాలిక ఒత్తిడిహొవల్ల ఈ హార్మోన్లు నిరంతరం ఉత్పత్తి అవుతూ, శరీరంలోని జీవక్రియలను దెబ్బతీస్తాయి. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ(Immune System) అసమతుల్యతకు గురవుతుంది.
ఒత్తిడి వల్ల ఏర్పడే జీవరసాయన మార్పులు:
– కార్టిసోల్ స్థాయిలు పెరగడం:హొఇది రోగనిరోధక కణాలను అణచివేస్తుంది.
ఇన్సులిన్ రెసిస్టన్స్ (Insulin Resistance)
– సైటోకైన్ల అసమతుల్యత:హొశరీరంలో ప్రొ-ఇన్ఫ్లమేటరీ సైటోకైన్లు(IL-6, TNFa) అధికంగా ఉత్పత్తివుతాయి. దీర్ఘకాలిక వాపు (Chronic Inflammation)
– ఆక్సిడేటివ్ స్ట్రెస్:హొఒత్తిడి వల్ల ఉచిత రాడికల్స్(Free Radicals)పెరిగి, కణాలకు నష్టం (ఉఞఱసa్‌ఱఙవ ణaఎaస్త్రవ) కలిగిస్తాయి.
– సింపతతిక నాడీ వ్యవస్థ (Sympathetic Nervous System) యాక్టివేషన్: రక్తపోటు, హదయ సమస్యలు.
ఈ మార్పులు శరీరంలో నిరంతర వాపును (Chronic Low-Grade Inflammation) కలిగించి, ఈ క్రింది రోగాలకు దారితీస్తాయి
ఇన్సులిన్ ప్రతిరోధకత (Insulin Resistance)
– ఒత్తిడి వల్లహొఅధిక IL-6 TNF-a ఉత్పత్తి అవుతుంది.-
ఇదిహొఇన్సులిన్ సెన్సిటివిటీని తగ్గిస్తుంది, ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.
– ఇదిహొఒబెసిటీ, మెటాబాలిక్ సిండ్రోమ్‌కు దారితీస్తుంది.
ఒత్తిడి హృదయ రోగాలకు (Cardiac Diseases)ఎలా దారితీస్తుంది?
– ఒత్తిడిహొసింపతతిక నాడీ వ్యవస్థను యాక్టివేట్ చేస్తుంది. ఫలితంగాహొరక్తనాళాలు సంకోచించడం,హొరక్తపోటు పెరగడం.
– ఇదిహొధమనుల గట్టిపడటానికి హొదారితీస్తుంది. ఇదిహొహార్ట్ అటాక్, స్ట్రోక్కు ప్రధాన కారణం.
ఒత్తిడి నాడీ వ్యవస్థపై (Neurological Disorders) ప్రభావం
మెదడు కణాలకు హాని(Neuroinflammation & Oxidative Stress)
– ఒత్తిడిహొమెదడులోని మైక్రోగ్లియా కణాలను యాక్టివేట్ చేస్తుంది. ఫలితంగాహొన్యూరోఇన్ఫ్లమేషన్.
– ఇదిహొన్యూరోనల్ డెజెనరేషన్కు దారితీస్తుంది, ఇదిహొఅల్జైమర్స్, పార్కిన్సన్స్ వంటి నాడీ వ్యాధులకు కారణమవుతుంది.
సెరోటోనిన్, డోపమైన్ స్థాయిలపై ప్రభావం:
– ఒత్తిడిహొసెరోటోనిన్, డోపమైన్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇదిహొడిప్రెషన్ , ఆందోళన కు దారితీస్తుంది.
– క్రానిక్ స్ట్రెస్‌హొమెమరీ నష్టం ,హొకాగ్నిటివ్ డిప్రెషన్కు కారణమవుతుంది.
నిద్రలో అసమతుల్యత (Sleep Disorders):
– ఒత్తిడిహొమెలటోనిన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది, ఫలితంగాహొనిద్రలేమి(Insomnia)..
– నిద్ర లేమిహొమరింతహొనాడీ వ్యవస్థ సమస్యలనుహొతీవ్రతరం చేస్తుంది.
సమగ్ర వైద్యం (Integrative Medicine): సమగ్ర ఆరోగ్య పరిష్కారం:
సాంప్రదాయక వైద్యం కేవలం లక్షణాలను నివారించడంపై దష్టి పెట్టగా, సమగ్ర వైద్యం (×అ్‌వస్త్రతీa్‌ఱఙవ వీవసఱషఱఅవ) మనస్సు, శరీరం, ఆత్మ యొక్క సమగ్ర సమతుల్యతను లక్ష్యంగా చేసుకుంటుంది.
1. మానసిక-భావనాత్మక సమతుల్యత(Integrative Medicine)
ధ్యానం, మైండ్ఫుల్నెస్:హొఒత్తిడి హార్మోన్లను తగ్గించి, శాంతిని కలిగిస్తుంది.
యోగా, ప్రాణాయామం:హొశ్వాసక్రియ నియంత్రణ ద్వారా నరాల వ్యవస్థను సమతుల్యం చేస్తుంది.
కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ కౌన్సిలింగ్:హొ సైకలాజికల్ కౌన్సిలింగ్ మానసిక భావోద్వేగ సంక్షోభాలను మెరుగుపరుస్తాయి, ప్రతికూల ఆలోచనలను మార్చడంలో సహాయపడుతుంది
2. పోషకాహార చికిత్స (Nutritional Therapy)
ఆంటీ-ఇన్ఫ్లమేటరీ ఆహారం: గింజలు, ఆకు కూరలు, టర్మరిక్, జింజర్ వంటి ఆహారాలు క్రానిక్ ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తాయి.
ఆక్సిడేటివ్ స్ట్రెస్ను తగ్గించే ఆహారాలు:హొవిటమిన్ C, E, ఓమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు.
3.హర్బల్, సహజ ఔషధాలు (Herbal & Natural supplements)
ప్రొబయోటిక్స్, ప్రీబయోటిక్స్: హొకడుపు ఆరోగ్యాన్ని మెరుగుపరచి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి
తులసి: హొఅడాప్టోజెనిక్ గుణం కలిగి ఉండి, ఒత్తిడిని నిరోధిస్తుంది.
టర్మరిక్ : కర్క్యుమిన్ వాపును తగ్గించే శక్తిని కలిగి ఉంటుంది.
4. జీవనశైలి మార్పులు (Lifestyle Modifications)
క్రమమైన శారీరక వ్యాయామం:హొఎండార్ఫిన్లు విడుదల చేసి, ఒత్తిడిని తగ్గిస్తుంది.
తగిన నిద్ర: సాధారణ వ్యక్తికి రోజుకు 8 నుంచి 9 గంటల నిద్ర అవసరం. తగిన నిద్ర వల్ల వ్యాధినిరోధక శక్తి మెరుగవుతుంది
సోషల్ కనెక్టివిటీ:హొమానసిక ఆధారం ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.
5. ఆల్టర్నేటివ్ థెరపీలు(Alternative Therapies)
మెడిటేషన్, మైండ్ఫుల్నెస్ (ఎనర్జీ హీలింగ్ (బయో ఎనర్జీ ఫ్రీక్వెన్సీ, మైండ్ఫుల్‌నెస్, ఒత్తిడిని తగ్గించి హౌలిస్టిక్‌గా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
ముగింపు:
సాంప్రదాయక వైద్యం కేవలం లక్షణాలను నివారించగా, సమగ్ర వైద్యం (Integrative Medicine) హొమనస్సు, శరీరం, ఆత్మ యొక్క సామరస్యాన్ని పునరుద్ధరించి, సహజమైన నయం చేయడానికి సహాయపడుతుంది..
”ఒత్తిడిని నిర్వహించుకోవడమే ఆరోగ్యానికి మొదటి మెట్టు! ఆరోగ్యం అనేది కేవలం రోగాలు లేకపోవడం కాదు, సంపూర్ణ శారీరక, మానసిక, సామాజిక సుఖసంతప్తి!”
Dr.Prathusha. Nerella
MD(General Medicine) CCEBDM; CCGDM; NLP; FID
Senior General Physician, Positive Psychologist certified Nutritionist, Diabetes And Lifestyle Expert, Pranic Healer Chiief Holistic Health Consultant And Medical Director @ Praveha General, Diabetes And Lifestyle Clinic – A Holistic Centre With Integrated Approach. Ph: 8897684912/040-49950314