Tuesday, December 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్థానిక ఎన్నికల బరిలో రాజీ కుదిరి.. కుదరక కొందరు..!

స్థానిక ఎన్నికల బరిలో రాజీ కుదిరి.. కుదరక కొందరు..!

- Advertisement -

– ఎమ్మెల్యే వంశీకృష్ణ మంతనాలు 
– కోండనాగులలో ఎమ్మెల్యే ప్రచారం
నవతెలంగాణ – బల్మూరు

సామాజిక చైతన్య భావన కలిగిన వ్యక్తిని నాయకునిగా ఎన్నుకోవాలి. తను స్వార్థం వైపు మొగ్గిన ఒకింత సమాజ అభివృద్ధి వైపు తొంగి చూస్తాడు అంటారు. అది కూడా నిజమనే అనుకోవచ్చు. కానీ.. అంత తీరిక వ్యక్తిత్వాన్ని గుర్తించే ఓపిక నేడు ఎక్కడ కనిపించదని ఎన్నికల్లో ప్రలోభాలకు మోసపోతున్నారని బహిరంగ చర్చనే వినిపిస్తున్నది. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి సరైన నేతను సర్పంచ్ గా వార్డు మెంబర్లుగా ఎన్నుకోవాలని చర్చించుకుంటున్న కథనం ‘ నవతెలంగాణలో…

 మండలంలో ఈనెల 17న మూడో విడతలో జరగనున్న గ్రామ పంచాయితీ ఎన్నికల విత్ డ్రాలు ముగిశాయి. అభ్యర్థులకు గుర్తులు కేటాయించి ప్రచారం చేసుకోమన్నారు. విత్ డ్రా కు రాజీ కుదిరి కొందరు అభ్యర్థులు తమ నామినేషన్ను పోటీ నుంచి ఉపసంహరించుకోగా, సయోధ్య కుదరక రాజీ పడమంటే పడమని బరిలో నిలిచేందుకు కొందరు పూనుకున్నారు. ఎవరు బరిలో ఉన్నా కూడా ఆలోచించి అభ్యర్థికి ఓటు వేయాలని పలువురు కోరుతున్నారు.

 మండల కేంద్రంలో ఉమామహేశ్వర రిజర్వాయర్ ముంపు బాధిత రైతులకు నష్ట పరిహారం పెంచి ఇస్తామని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ కార్యకర్తలు రైతుల సమక్షంలో హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇటీవల ఆయన ప్రత్యేక మంతనాలు నిర్వహించారని రహస్యంగా వచ్చి వెళ్లారని తెలిసింది. ఈ సందర్భంగా రిజర్వాయర్ బాధ్యత రైతులకు గతంలో ప్రకటించిన 12 లక్షల రూపాయలు గాక 15 లక్షల రూపాయలు ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది. రైతులకు అంతకంటే ఎక్కువ కూడా కొడంగల్  లో రైతులకు 20 లక్షల రూపాయలు నష్టపరిహారంగా ఇచ్చిన తీరుగా ఇచ్చేందుకు కూడా ఆలోచిస్తున్నట్లు ముఖ్యమంత్రి సహాయంతో చేయనున్నట్లు హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అధికార పార్టీ వైపే ఈ స్థానిక ఎన్నికలు మొగ్గు చూపవచ్చని పలువు అభిప్రాయపడుతున్నారు.

ఎన్నికల బరిలో నిలిచేవారు కార్యకర్తలను సమీకరించుకోవడం సమావేశాలు నిర్వహించుకోవడం ఎవరు ఎన్ని ఓట్లు తెస్తారు అని లెక్కలు వేసుకోవడం మామూలు అయిపోయింది. సాయంత్రం తమ తమ కార్యకర్తలు నాయకులతో దావత్ లు షురూ చేశారని పలువురు చర్చించుకోవడం వినిపిస్తున్నది. నేటితో బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరో తేలడంతో ప్రచారాల హంగామా జోరుగా కొనసాగించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామాలలో ఎన్నికల సందడి నెలకొన్నది. ముందస్తుగా మండలంలోని కొండనాగుల గ్రామ పంచాయితీ సర్పంచ్ అభ్యర్థి ఖరారు కావడంతో గత రాత్రి అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ప్రచారాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఏది ఏమైనా ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను ఆచితూచి ఓటర్లు ఎన్నుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -