అసోం ముఖ్యమంత్రి హిమాంత ఆరోపణ
తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్
గౌహతి : కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ కు, ఆయన భార్య ఎలిజబెత్ గొగోయ్ కు పాకిస్తాన్‌తో సంబంధాలు ఉన్నాయని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రపంచ వేదికలపై భారత్‌ను విమర్శించే పాక్ జాతీయుడు అలీ తౌఖీర్ షేక్‌తో ఎలిజబెత్‌కు సంబంధాలున్నాయని తెలిపారు. ఆ ఏజెంట్ 2010-13 మధ్యకాలంలో 13 సార్లు భారత్‌కు వచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. గౌహతిలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో హిమాంత మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘పాకిస్తానీ ఏజెంట్ అలీతో గౌరవ్ గొగోయ్, ఆయన భార్య, బ్రిటన్ పౌరురాలైన ఎలిజబెత్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
2011లో ఆమె అమెరికా నుంచి పాకిస్తాన్‌కు వెళ్లారు. అక్కడ పాక్ సంస్థ ఆమెకు ఉద్యోగం ఇచ్చింది. ఆ తర్వాత భారత్‌కు బదిలీ చేసింది. ఆమె జీతాన్ని అలీ చెల్లించాడు. ఎలిజబెత్ భారత్‌లోని ఒక సంస్థలో పని చేస్తూ దేశానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి పాకిస్తాన్‌కు చేరవేశారు. తొమ్మిది సార్లు పాక్‌కు వెళ్లారు’ అంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఈ ఆరోపణలను గొగోయ్ తీవ్రంగా ఖండించారు. ఈ శతాబ్దంలోనే అత్యంత ఘోరమైన ప్రెస్ కాన్ఫరెన్స్‌గా ఆయన అభివర్ణించారు. సి-గ్రేడ్ సినిమా కంటే దారుణంగా ఉందన్నారు. అత్యంత బుద్ధిహీనమైన, బూటకపు పాయింట్లుగా కొట్టిపారేశారు.
కాంగ్రెస్ ఎంపీతో పాక్ ఏజెంట్‌కు సంబంధాలు
- Advertisement -
- Advertisement -



