– కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్న మోడీ సర్కార్
– ఆర్టీసీ రక్షణ కోసం ఉద్యమం
– సార్వత్రిక సమ్మెకు సన్నద్ధమవుదాం : వెబినార్‌లో ఆర్టీసీ సంఘాల నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మోడీ సర్కార్ కార్మిక హక్కుల్ని హరించే కుట్రకు పాల్పడుతున్నదనీ, దీనికి వ్యతిరేకంగా పోరాడాలని ఎస్‌డబ్ల్యూఎఫ్(సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు, ఎస్‌డబ్ల్యూయూ (ఐఎన్‌టీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రాజిరెడ్డి, వైస్ చైర్మెన్ జి అబ్రహం, గోపాల్ పిలుపునిచ్చారు. ఈ నెల 20న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె నేపథ్యంలో బుధవారం వెబినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా వీఎస్ రావు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లుగాగా తీసుకు రావటమంటే..కార్మిక వర్గ హక్కులను కాలరాయటమేనని ఆందోళన వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకున్న చట్టాలను క్రమంగా నీరుగారుస్తూ కార్పొరేట్ల ప్రయోజనాలకు ఆటంకం లేని విధంగా సవరణలను మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్నదని చెప్పారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు హరించటమంటే..క్రమంగా సంఘం పెట్టుకునే స్వేచ్ఛను వదులుకోవటమేనని హెచ్చరించారు. సమస్యలపై ఉద్యమించే హక్కును కోల్పోవటమేనని చెప్పారు. కార్మికుల రక్షణ కోసం ఉన్న చట్టాలను పారిశ్రామిక వేత్తల రక్షణకు ఉపయోగపడే విధంగా సవరించటం పాలకులకు తగునా? అని ప్రశ్నించారు. రాజిరెడ్డి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకొచ్చినా కార్మిక వర్గ ప్రతిఘటన వల్ల వాటి అమలుకు సాహసించటం లేదని చెప్పారు.అబ్రహం, గోపాల్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొనాల్సిన అవశ్యకతను వివరించారు. ఆర్టీసీలో ఉద్యోగుల రక్షణ, ఉద్యోగ భద్రత కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
కార్మిక హక్కుల్ని హరించే కుట్ర
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES