Saturday, February 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎదురుదాడే మన వ్యూహం..

ఎదురుదాడే మన వ్యూహం..

- Advertisement -

90 శాతం మున్సిపాల్టీలు కైవసం చేసుకోవాలి : పురపోరుపై సీఎం, డిప్యూటీ సీఎం ప్రత్యేక భేటి
సింగరేణి టెండర్లు, బడ్జెట్‌, అసెంబ్లీ సమావేశాలపై చర్చ


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి బీజేపీ, బీఆర్‌ఎస్‌లపై ఎదురుదాడే వ్యూహంగా ముందుకు సాగాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్ణయించారు. ప్రచారం సందర్భంగా గత రెండేండ్లుగా తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు ఏకరువు పెట్టనున్నారు. తద్వారా మొత్తం 90 శాతానికి పైగా మున్సిపాల్టీలను కైవసం చేసుకోవాలని నిర్ణయించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోగల సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సీఎం విదేశీ పర్యటన అనంతరం వీరిద్దరూ మొదటిసారి భేటీ అయ్యారు. మున్సిపల్‌ ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు ఇటీవల ముఖ్యమంత్రి.. మంత్రులందరితో భేటీ అయినప్పటికీ.. ఆరోజు ఖమ్మంలో ఉండటంతో భట్టి ఆ సమావేశానికి హాజరు కాలేకపోయారు.

ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం.. సీఎంతో శుక్రవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రేవంత్‌ రెడ్డి దావోస్‌ వెళ్లిన సమయంలో సింగరేణి బొగ్గు గనుల టెండర్ల విషయం వివాదాస్పదమైంది. పత్రికల్లో వచ్చిన కథనాలపై డిప్యూటీ సీఎం వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తాజాగా రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క భేటీలో ఈ అంశం చర్చకొచ్చినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి సీఎం పూర్వాపరాలన్నీ అడిగినట్టు తెలిసింది. ఒకవైపు మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం, మరోవైపు బడ్జెట్‌ కసరత్తులు.. ఈ రెండింటినీ ఎలా సమన్వయం చేద్దామనే విషయమై ఇరువురూ సమాలోచనలు చేశారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం, మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్నే ప్రధాన అజెండా చేయాలని వారు నిర్ణయించారు. మార్చిలో నిర్వహించబోయే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల గురించి కూడా వారిరువురూ ఈ సందర్భంగా చర్చించినట్టు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -