Thursday, August 14, 2025
EPAPER
spot_img
Homeజాతీయంఎస్సీ, ఎస్టీల్లో రిజర్వేషన్లకూ క్రీమీలేయర్‌ తరహాలో ఒక వ్యవస్థ కావాలి

ఎస్సీ, ఎస్టీల్లో రిజర్వేషన్లకూ క్రీమీలేయర్‌ తరహాలో ఒక వ్యవస్థ కావాలి

- Advertisement -

అక్టోబరు 10న విచారించనున్న సుప్రీం
న్యూఢిల్లీ :
ఎస్సీ, ఎస్టీల్లో రిజర్వేషన్‌ ప్రయోజనాలను సమానంగా పంపిణీ చేయడానికి గానూ ఓబీసీల్లో క్రీమీ లేయర్‌ మాదిరిగానే ఒక వ్యవస్థను ప్రవేశపెట్టాలని కోరుతున్న పిటిషన్‌ను విచారించాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. రామశంకర్‌ ప్రజాపతి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోమాల్యా బాగ్చిలతో కూడిన బెంచ్‌ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ప్రస్తుత రిజర్వేషన్‌ విధానం ఎస్‌సీ, ఎస్‌టీల్లో ఇప్పటికే బాగా సంపన్నులై, సామాజికంగా కూడా పలుకుబడి కలిగిన గ్రూపులకు అసమానంగా ప్రయోజనాలు సమకూరుస్తోంది. అదే సమయంలో సమాజంలో అత్యంత వెనుకబడిన, దారిద్య్రం మగ్గుతున్న వారు మాత్రం ఇంకా దుర్భర దారిద్య్రంలో మగ్గుతునే వున్నారని ఆ పిటిషన్‌ పేర్కొంది. రిజర్వేషన్‌ విధానంలో ఆర్థిక ప్రామాణికాలను చొప్పించాల్సిన అత్యవసరం ఎంతైనా వుందని ప్రజాపతి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రజాపతి తరపున న్యాయవాదులు సందీప్‌ సింగ్‌, రీనా ఎన్‌.సింగ్‌లు కోర్టులో తమ వాదనలు వినిపించారు. ఎస్‌సీ, ఎస్‌టీ కేటగిరీల్లో అమలు పరిచేందుకు రెండంచెల రిజర్వేషన్‌ వ్యవస్థను ప్రవేశపెట్టాలని పిటిషన్‌ కోరుతోంది. సాపేక్షంగా ఇప్పటికే ధనవంతులైన వారికే ప్రయోజనాలు అందించడానికి బదులుగా ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన వారికి ప్రాధాన్యతనివ్వాలని పిటిషన్‌ కోరింది.
శాతాన్ని తగ్గించడం కాదు, సంస్కరించండి
పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనఅంటే ఎస్సీ, ఎస్టీలకు లేదా ఇతర మైనారిటీ కమ్యూనిటీలకు ప్రస్తుతమున్న రిజర్వేషన్‌ శాతాన్ని తగ్గించడం కాదు, కుల ప్రాతిపదిక రిజర్వేషన్లను రద్దు చేయాలని లేదా దెబ్బ తీయాలని ఈ సంస్కరణ ప్రతిపాదన కోరడం లేదు. కానీ ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పరిధిలోనే ఆదాయ పరిధి ప్రాతిపదికగా ప్రాధాన్యతనిచ్చే యంత్రాంగాన్ని ప్రవేశపెట్టడం ద్వారా అనుకున్న ప్రయోజనం మరింత సమర్ధవంతంగా నెరవేరేలా చూడడం అవసరమని పిటిషనర్‌ తరపున న్యాయవాదులు పేర్కొన్నారు.

అక్టోబరు 10న దీనిపై విచారణ జరపాలని బెంచ్‌ నిర్ణయించింది. రిజర్వేషన్‌ విధానంలోని సున్నితత్వాన్ని, విభిన్న అభిప్రాయాలు తలెత్తే అవకాశాలను పరిగణనలోకి తీసుకుంటూ ఈ అంశాన్ని అత్యంత జాగ్రత్తగా విచారించాల్సిందిగా సూచించింది. కమ్యూనిటీల్లో ఆర్థిక సామర్ధ్యాలను అంచనా వేసేందుకు ప్రభుత్వానికి గల సమర్ధత చుట్టూనే ఈ భావన తిరుగుతోందని జస్టిస్‌ సూర్యకాంత్‌ విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad