Sunday, May 18, 2025
Homeతెలంగాణ రౌండప్యువత సృజనాత్మకతకు పట్టాభిషేకం..

యువత సృజనాత్మకతకు పట్టాభిషేకం..

- Advertisement -

జూన్ 2న తెలంగాణ యువ కెరటాలు కవి సమ్మేళనం 
తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతి కుమార్
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
: జూన్ 2న తెలంగాణ యువ కెరటాలు శీర్షికన యువ కవుల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షులు అవంతి కుమార్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఎమ్మెల్సీ కవిత క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ సారస్వత పరిషత్ లో జరగనున్న ఈ సమ్మేళనానికి సంబంధించిన కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అవంతి కుమార్ మాట్లాడుతూ.. సాహిత్య రంగంలో యువతను ప్రోత్సహించడానికి తమ అధ్యక్షురాలు కవిత చేస్తున్న కృషి ముందుతరాలకు వెలుగు బాటలు వేస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ జీవనశైలి విశిష్టతను చాటి చెప్పే ఈ యువ కవి సమ్మేళనం లో తెలంగాణ ఆత్మను ఆవిష్కరిస్తూ, తెలంగాణ తాత్వికతను, చారిత్రక నేపథ్యాన్ని, సాంస్కృతిక వైభవాన్ని, సౌభ్రాతృత్వాన్ని, సహనశీలతను, సమగ్రతను, ప్రత్యేకంగా తెలంగాణ సమాజంలో కనిపించే సమిష్టితత్వాన్ని ప్రతిబింబించేలా యువ కవులు, కవయిత్రులు తమ కలాలకు పదును పెట్టాలని ఆయన కోరారు. జిల్లా నుంచి యువసాహితీవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన ఆహ్వానించారు. పాల్గొన దలచిన కవులు, కవయిత్రులు 35 ఏళ్ల లోపువారు అయి ఉండాలని, తెలుగు, హిందీ ఇంగ్లీష్, ఉర్దూ భాషలలో తమ కవితలు వినిపించవచ్చని . యువ కవులు కవయిత్రులు తమ పేరును నమోదు చేయించుకోవడానికి తమ వివరాలతో ఈ నెల 26వ తేదీ లోపు kavitha.telangana@gmail.com కు మెయిల్ చేయాలని వివరించారు. కవులు కవయిత్రులు తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమ చరిత్రను, పోరాట స్పూర్తిని తమ కవితలలో చాటిచెప్పాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి ఘనపురం దేవేందర్, తెలంగాణ జాగృతి సాహిత్య విభాగం కన్వీనర్ తిరుమల శ్రీనివాస్ ఆర్య, శ్యామల సాయి కృష్ణ, హరీష్ యాదవ్ , ఆకాష్, ,తేలు సరిత, శోభవతి, సరిత, నితిన్, రేఖ ,బుచ్చమ్మ రోహిత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -