వినూత్నంగా పార్డి (బి) గ్రామ పంచాయతి ఎన్నికల ఫలితాలు
నవతెలంగాణ కుభీర్
మండలంలో జరిగిన మూడో విడత ఎన్నికలు బుధువారం ప్రశాంతంగా ముగిశాయి. మండలంలో 42గ్రామ పంచాయతీ లు ఉండగా ముడు గ్రామ పంచాయతీ లు ఎకగ్రీవమయ్యాయి. 39గ్రామ పంచాయతీ లో ఎన్నికలు జరిగాయి. మండలంలోని పార్డి (బి) గ్రామ పంచాయతీ ఎన్నికలు హోరా హోరిగా జరగాయి. సాయంత్రం వెలువడిన ఫలితాలు విన్నుతంగా రావడం జరిగింది. నూతనంగా ఎన్నికైన మడి ప్రవీణ్ 22 యువకుడు మొదటి సరిలోనే సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి సమీప పత్యర్థి టి. రాజేశ్వర్ పై 307ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ .. నామీద నమ్మకం ఉంచి నన్ను సర్పంచ్ గా గెల్పించిన గ్రామ ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు. అదే విదంగా గ్రామంలో ఉన్న పలు సమస్యలను పరిశీలించి గ్రామ అభివృద్ది కి కృషి చేస్తానని అన్నారు. ముఖ్యంగా మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచి నీళ్లు అందేలా చూస్తానని అన్నారు.
ఉత్కంఠకు తెర.. యువకుడికి పట్టం కట్టిన గ్రామస్తులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



