- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
మండలంలోని బాదంపల్లి గ్రామానికి చెందిన గురిజాల సుమతికి తన తోటి పదవ తరగతి బాల్య మిత్రులు గురువారం ఆపన్న హస్తాన్ని అందించారు. ఆమె భర్త వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. సుమతికి ఆరవ తరగతి చదువుతున్న ఒక కూతురు ఉంది. ఆపత్కాలంలో ఉన్న ఆత్మీయ నేస్తాన్ని పరామర్శించి, ఆర్థిక సాయంతో చేయూతనిచ్చారు. స్నేహితులందరూ ఏర్పరచుకున్న “వసుదైక కుటుంబం ఎస్ఎస్సి 2005 జేవిఎన్ఆర్ఏం జెడ్పిఎస్ఎస్ ద్వారక సేవా ట్రస్ట్” ద్వారా రూ.40 వేలు బుధవారం అందజేశారు. కుటుంబ ఆపద సమయంలో భరోసానిచ్చిన బాల్యమిత్రులను గ్రామస్తులతోపాటు పలువురు అభినందించారు.
- Advertisement -



