- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో గురువారం జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. వేములవాడ అర్బన్ మండలం చింతల్ ఠాణా ఆర్ అండ్ ఆర్ కాలనీలో చనిపోయిన అభ్యర్థి సర్పంచ్‌గా గెలిచాడు. గ్రామానికి చెందిన చెర్ల మురళి(50) బీఆర్ఎస్ మద్దతుతో బరిలోకి దిగాడు. గత గురువారం ఆయన గుండెపోటుతో చనిపోయాడు. ఇక ఇవాళ ప్రకటించిన ఫలితాల్లో 700లకు పైగా ఓట్లు సాధించి, 378 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు.
- Advertisement -



