– కారు, డీసీఎం ఢకొీని ముగ్గురు మృతి
– మరొకరి పరిస్థితి విషమం
నవతెలంగాణ -హయత్‌నగర్
పది నిమిషాల్లో వారు ఇంటికి చేరుకునే వారు. కానీ ఈలోగా వారు ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న డీసీఎంను వేగంగా ఢకొీట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూర్ గ్రామ పరిధిలో బుధవారం జరిగింది. ఇన్‌స్పెక్టర్ నాగరాజ్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట మున్సిపాల్టీ కుంట్లూర్ గ్రామానికి చెందిన పిన్నిటి చంద్రసేనారెడ్డి(24), చుంచు త్రినాధ్ రెడ్డి(24), చుంచు వర్షిత్ రెడ్డి(24), అలివేటి పవన్ కళ్యాణ్ రెడ్డి కలిసి సెకండ్ హ్యాండ్ కార్ల బిజినెస్ చేస్తున్నారు. మహారాష్ట్రలో సెకండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు చేసి హైదరాబాద్‌లో విక్రయిస్తారు. ఈనెల 20న స్కోడా కారులో పెద్ద అంబర్‌పేటలో ఓ శుభకార్యానికి హాజరై.. నారపల్లిలో ఉన్న త్రినాధ్‌రెడ్డి ఫామ్‌హౌస్‌కు వెళ్లి అక్కడే బస చేశారు. బుధవారం తెల్లవారుజామున కారులో హయత్‌నగర్ నుంచి పసుమాముల మీదుగా ఇంటికి చేరుకునే సమయంలో నారాయణ కాలేజ్ బాలికల క్యాంపస్ వద్దకు రాగానే నిద్రమత్తు, అతివేగంతో ప్రయాణిస్తున్న వీరంతా ఎదురుగా వస్తున్న డీసీఎంను ఢకొీట్టారు. దాంతో చంద్రసేనారెడ్డి, త్రినాధ్‌రెడ్డి, వర్షిత్‌రెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు. అలివేటి పవన్ కళ్యాణ్‌రెడ్డి తీవ్రగాయాలతో హయత్‌నగర్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురి మృతితో కుంట్లూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
హయత్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES