Sunday, September 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవి నుంచి జడ్పీపీఠం కోసం చెవిటి గురి!

కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవి నుంచి జడ్పీపీఠం కోసం చెవిటి గురి!

- Advertisement -

నవతెలంగాణ – తుంగతుర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లను జిల్లా అధికార యంత్రాంగం శనివారం ఖరారు చేసింది. జిల్లాలోని 23 మండలాలకు 23ఎంపీపీలు, 23 జడ్పిటిసిలు, 235 ఎంపీటీసీలు, 486 సర్పంచ్లు, 4388 వార్డు మెంబర్లకు కలెక్టర్ ఆధ్వర్యంలో రిజర్వేషన్లు ఖరారు చేశారు. శనివారం ప్రకటించిన రిజర్వేషన్ల ద్వారా తుంగతుర్తి నియోజకవర్గ ముద్దుబిడ్డ, గుమ్మడవెల్లి గ్రామ నివాసి, సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ జెడ్పి చైర్మన్ పదవి బీసీ జనరల్ కావడంతో పోటీకి సిద్ధమయ్యారు. జిల్లాలో జడ్పీపీఠం దక్కాలంటే ఆత్మకూరు ఎస్, చిలుకూరు, చింతలపాలెం, చివ్వెంల, గరిడేపల్లి, జాజిరెడ్డిగూడెం, కోదాడ, మఠంపల్లి, మేళ్లచెరువు, నడిగూడెం, నాగారం, నేరేడుచర్ల, పాలకీడు, పెన్పహాడ్, సూర్యాపేట మండలాల నుండి జడ్పిటిసిగా పోటీ చేయాల్సి ఉంటుంది.

కాగా చెవిటి వెంకన్న యాదవ్ తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తుంగతుర్తి, ముద్దిరాల మండలాల నుండి పోటీ చేయాలని భావించినప్పటికీ రిజర్వేషన్లు కలిసి రాకపోవడంతో నాగారం నుండి అక్కడి నాయకులను ఒప్పించి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో లేని సమయంలో తుంగతుర్తి నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ కు తానున్నానంటూ భరోసా కల్పించిన నాయకుడు చెవిటి వెంకన్న యాదవ్.

రాజకీయ జీవితం: 1994-96 తుంగతుర్తి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా.. 1996-2001 వరకు గుమ్మడవల్లి ఉప సర్పంచ్ గా,1996-2002 వరకు ఉమ్మడి నల్గొండ జిల్లా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా.. 2008-2014 తిరుమలగిరి మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేశారు. సూర్యాపేట జిల్లా ఏర్పాటు నుండి నేటి వరకు పార్టీ జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నారు.2024 లో రైతు కమిషన్ సభ్యులుగా ఎంపికయ్యారు. కాంగ్రెస్ పార్టీ అత్యంత పటిష్ఠంగా చేపట్టిన డిజిటల్ సభ్యత్వ నమోదులో నల్లగొండ పార్లమెంట్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడానికి, ఆ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న కృషి అమోఘం. మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న 542 పార్లమెంట్ స్థానాల్లో నల్గొండ పార్లమెంటుకు మొదటి స్థానం దక్కడం చరిత్రలోనే ఒక రికార్డుగా నిలిచింది.

ఇందులో భాగంగా నల్గొండ పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిశీలిస్తే సూర్యాపేట జిల్లా మొదటి స్థానంలో నిలవడం మరో రికార్డు ఆయన సొంతం.తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ను కాపాడుతూ ఎమ్మెల్యే గెలుపు కోసం కృషి చేశారు. 2014 లో ఎమ్మెల్యే సీటు కోసం 2018లో ఎంపీ సీటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. అధిష్టానం బుజ్జగించి సీటు ఇవ్వనప్పటికీ నాటి ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశారు. మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి, తుంగతుర్తి శాసనసభ్యులు మండల సామేల్ ల సహకారంతో సూర్యాపేట జిల్లా పరిషత్ చైర్మన్ కోసం ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలు, స్థానిక నాయకుల సహకారం, జిల్లా అధ్యక్షునిగా ఉన్న పరిచయాలు తనకు కలిసి వచ్చే అవకాశాలుగా భావిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -