– బషీరాబాద్ సర్పంచ్ జమున మహేష్
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
కాపరులు తమ మేకలు, గొర్రెలకు సకాలంలో నట్టల నివారణ మందులు వేయించాలని సర్పంచ్ బైకాన్ జమున మహేష్ అన్నారు. శనివారం మండలంలోని బషీరాబాద్ గ్రామంలో పశు వైద్య, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలకు, మేకలకు నట్టల నివారణ మందుల పంపిణీ శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని సర్పంచ్ సర్పంచ్ జమున మహేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు తమ మేకలు, గొర్రెలు వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు సకాలంలో నట్టల నివారణ ద్రావణాన్ని తాగించాలన్నారు.
ప్రభుత్వం ఉచితంగా ఏర్పాటు చేస్తున్న నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని గొర్ల మేకల కాపరులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గొర్రెలు, మేకలకు సకాలంలో నట్టల నివారణ మందులు వేయించడం ద్వారా ఎంతో మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ చిలివేరి భూమేశ్వర్, చౌట్ పల్లి పశు వైద్యాధికారి డాక్టర్ వసంత్ కుమార్, వెటర్నరీ అసిస్టెంట్ సత్యం, గోపాలమిత్ర శర్వాన్, నాయకులు జి.రాజు, గంగాధర్, తిరుపతి, నరేష్, యాదవ సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.



