Tuesday, March 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపేద ప్రజలకు తీరని లోటు

పేద ప్రజలకు తీరని లోటు

- Advertisement -

‘గంగదేవిపలి’్లని దేశానికే దిక్సూచిగా నిలిపిన ‘కూసం రాజమౌళి’:
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
ఆయన భౌతికకాయానికి పూలమాలలువేసి నివాళ్లు
నవతెలంగాణ-గీసుగొండ

కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని పుణికిపుచ్చుకుని, గ్రామ పరిపాలనలో ప్రజలను భాగస్వాములను చేస్తూ గంగదేవిపల్లిని దేశానికే దిక్సూచిగా నిలిపిన కూసం రాజమౌళి మరణం పేద ప్రజలకు తీరని లోటని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. ఆదివారం గుండెపోటుతో కన్నుమూసిన వరంగల్‌ జిల్లా గీసుగొండ మండలం గంగదేవిపల్లి మాజీ సర్పంచ్‌ రాజమౌళి భౌతికకాయానికి సోమవారం గంగదేవిపల్లిలో జాన్‌వెస్లీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజమౌళి ప్రస్థానాన్ని కొనియాడారు. చిన్న వయసులోనే కమ్యూనిస్టు ఉద్యమాలకు ఆకర్షితుడైన రాజమౌళి, నిస్వార్ధంగా పనిచేసి పంచాయతీ పాలనకు ఒక కొత్త నిర్వచనం ఇచ్చారని తెలిపారు.

మద్యపాన నిషేధం, బెల్టుషాపుల రద్దు, ఇంటింటికీ మరుగుదొడ్డి, పచ్చదనంతో ఒక పల్లెటూరు ఎలా ఉండాలో ప్రపంచానికి చాటిచెప్పారని అన్నారు. నాడు పశ్చిమ బెంగాల్‌లోని కమ్యూనిస్టు ప్రభుత్వాల తరహాలో 73, 74 రాజ్యాంగ సవరణల ప్రకారం పంచాయతీలకు 50 శాతం నిధులు కేటాయించాలని ఆయన నిరంతరం పోరాడారని గుర్తు చేశారు. నేటి సర్పంచులు రాజమౌళిని స్ఫూర్తిగా తీసుకుని గ్రామ వికాసానికి కృషి చేయాలని పిలుపుని చ్చారు. నివాళులర్పించిన వారిలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యద ర్శివర్గ సభ్యులు జి.నాగయ్య, ఎండీ అబ్బాస్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు టి. స్కైలాబ్‌ బాబు జిల్లా నాయకులు ఉన్నారు.

రాజమౌళి సేవలు చిరస్మరణీయం : ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌ రెడ్డి
గంగదేవిపల్లి గ్రామ మాజీ సర్పంచ్‌, సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు కూసం రాజమౌళి మృతి పట్ల పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజమౌళి భౌతిక కాయంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. గ్రామాభివృద్ధికి కూసం రాజమౌళి చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. గంగాదేవిపల్లిని దేశవ్యాప్తంగా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఆయన మరణం గ్రామానికి తీరని లోటని అన్నారు. సీపీఐ(ఎం) స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొని రాజమౌళి సేవలను స్మరించుకున్నారు. కాగా, జీవితాంతం తాను నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి, రాష్ట్రపతి, ముఖ్యమంత్రుల చేతుల మీదుగా అవార్డులు అందుకున్న రాజమౌళి మరణం జిల్లా రాజకీయాల్లో విషాదాన్ని మిగిల్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -