Thursday, August 7, 2025
E-PAPER
spot_img
Homeసినిమాభిన్న కాన్సెప్ట్‌ కథ

భిన్న కాన్సెప్ట్‌ కథ

- Advertisement -

హాస్య నటుడు ప్రవీణ్‌ తొలిసారి హీరోగా నటిస్తున్న చిత్రం ‘బకాసుర రెస్టారెంట్‌’. హంగర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి ఎస్‌జే శివ దర్శకుడు. ఎస్‌జే మూవీస్‌ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి నిర్మించారు. ఈ నెల 8న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా బుధవారం కథానాయకుడు ప్రవీణ్‌ మీడియాతో పలు విశేషాలను షేర్‌ చేసుకున్నారు.
ఈ సినిమా ఐదు పాత్రలతో నడుస్తుంది. ఇందులో కథను నడిపించే పరమేష్‌ అనే పాత్రలో నేను కనిపిస్తాను. నా పాత్రలో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషన్‌ కూడా ఉంటుంది. నా పాత్రకు ఉండే ఓ యాంబిషన్‌ ఎలా ఫుల్‌ ఫిల్‌ అయ్యింది అనేది ఆసక్తికరంగా ఉంటుంది.
నా పాత్ర చుట్టే కథ నడుస్తుంది. పర్‌ఫార్మెన్స్‌ వైజ్‌ నాది రెగ్యులర్‌ పాత్ర కాదు. కథలో హర్రర్‌, థ్రిల్లర్‌, మైథాలజీ ఇలా అన్నీ మిక్స్‌ అయ్యాయి. సినిమాను దర్శకుడు ఎంతో క్లారిటీగా తెరకెక్కించాడు.
ఇదొక కాన్సెప్ట్‌ కథ. ఓ తిండిబోతు దెయ్యం పెట్టే ఇబ్బంది చాలా ఎంటర్‌టైనింగ్‌గా, ఎమోషన్‌ల్‌గా ఉంటుంది. శిరీష్‌ సినిమా చూసి మంచి కథను ఎంచు కున్నారు అన్నారు. సినిమా ఆయనకు బాగా నచ్చింది. అందుకే ఎస్వీసీ ద్వారా విడుదల చేస్తున్నాం.
ఇందులో పతాక సన్నివేశాలు చాలా ఎమోషనల్‌గా ఉంటాయి. మన జీవితంలోకి వచ్చిన మంచి స్నేహితుడు అనివార్య కారణాల వల్ల వెళ్లిపోవాల్సి వస్తే మనలో ఓ పెయిన్‌ ఉంటుంది. ఈ కైండ్‌ ఆఫ్‌ ఎమోషన్‌ ఈ సినిమాలో కూడా ఉంటుంది. ఇది అందరి హదయాలకు హత్తుకుంటుంది. ప్రస్తుతం నేను ‘విశ్వంభర, ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌, మాస్‌ జాతర, లెనిన్‌, ఆకాశంలో ఓ తార’ చిత్రాల్లో నటిస్తున్నాను.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img