‘నువ్విలా, జీనియస్, రామ్ లీలా, సెవెన్’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో హవీష్, ‘సినిమా చూపిస్త మావ, నేను లోకల్, ధమాకా, మజాక’ వంటి సూపర్ హిట్ చిత్రాలతో తన ప్రత్యేకతను చాటుకున్న దర్శకుడు నక్కిన త్రినాథరావు కాంబోలో ఓ క్రేజీ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ మూవీకి నిఖిల కోనేరు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
‘ఓ డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. భిన్న పాత్రలు, వైవిధ్యమైన సినిమాలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నం చేస్తున్న హీరో హవీష్ అదే ప్రయత్నంలో భాగంగా ఓ సరికొత్త కంటెంట్ ఉన్న చిత్రంతో మరోమారు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో ఆయన పోషించే పాత్ర అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తుంది. అలాగే భిన్న కమర్షియల్ సినిమాలకు పేరొందిన దర్శకుడు త్రినాథరావు నక్కిన ఈ సినిమాని తనదైన మార్క్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో మేకర్స్ వెల్లడించనున్నారు’ అని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి నిర్మాణం- హార్నిక్స్ ఇండియా ఎల్‌ఎల్‌పి, ఫైట్స్ – రామకష్ణ, ఎడిటర్ – ప్రవీణ్ పూడి, డీవోపీ – నిజార్ షఫీ, సంగీతం – మిక్కీ జే మేయర్, స్టోరీ, డైలాగ్స్ – విక్రాంత్ శ్రీనివాస్, నిర్మాత – నిఖిల కోనేరు, రచన: దర్శకత్వం – నక్కిన త్రినాథరావు.
డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్
- Advertisement -
- Advertisement -