Sunday, August 3, 2025
E-PAPER
Homeసినిమాభిన్న ప్రేమకథ

భిన్న ప్రేమకథ

- Advertisement -

ఓ అచ్చమైన, స్వచ్ఛమైన తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో ‘మోతెవరి లవ్‌ స్టోరీ’ అనే సిరీస్‌ ఈనెల 8న జీ5లో స్ట్రీమింగ్‌ కానుంది. అనిల్‌ గీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌ను శివ కష్ణ బుర్రా రూపొందించారు. మధుర శ్రీధర్‌ రెడ్డి, శ్రీరామ్‌ శ్రీకాంత్‌ నిర్మాతలు. ఏడు ఎపిసోడ్స్‌గా రాబోతున్న ఈ సిరీస్‌ నుంచి శుక్రవారం ‘గిబిలి గిబిలి’ అనే పాటను మేకర్స్‌ విడుదల చేశారు. హీరోయిన్‌కు తన మనసులోని ప్రేమను హీరో వ్యక్తం చేసే క్రమంలో ఈ పాట వస్తుంది. సోషల్‌ మీడియాలో ఫ్రీక్వెంట్‌గా ఉపయోగించే పదాలతో ఈ పాటను రాయటం అందరినీ ఆకట్టుకుంటోంది. మల్లెగోడ గంగ ప్రసాద్‌ రాసిన ఈ పాటను రాహుల్‌ సిప్లిగంజ్‌ పాడగా, చరణ్‌ అర్జున్‌ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. అనిల్‌ గీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి శ్రీకాంత్‌ అరుపుల సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, అనీల్‌ గీల ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -