సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్‌బాబు తనయుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతూ నటిస్తున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు.
వైజయంతి మూవీస్ అశ్వినిదత్ సమర్పిస్తుండగా, ‘చందమామ కథలు’ బ్యానర్‌పై పి.కిరణ్ నిర్మిస్తున్నారు. రషా తడాని కథానాయిక. 30 రోజులు పాటు ఏకధాటిగా కొనసాగిన తొలి షెడ్యూల్‌ను యూనిట్ కంప్లీట్ చేసింది. ఈ షెడ్యూల్‌లో దాదాపు 30% చిత్రీకరణను పూర్తి చేశారు. మధ్యప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలోని అందమైన లొకేషన్స్‌లో కీలక సన్నివేశాలు, అద్భుతమైన పాటలతోపాటు ముఖ్యమైన టాకీపార్ట్‌ను షూట్ చేశారు. ఇప్పటివరకు వచ్చిన అవుట్‌ఫుట్‌తో మేకర్స్ చాలా హ్యాపీగా ఉన్నట్లు చిత్ర బృందం తెలిపింది. సంక్రాంతి తరువాత తదుపరి షెడ్యూల్ ప్రారంభం కానుంది.
డిఫరెంట్ లవ్‌స్టోరీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



