Saturday, November 8, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఇప్పటి వరకు చూడని భిన్న సినిమా

ఇప్పటి వరకు చూడని భిన్న సినిమా

- Advertisement -

యష్‌ నటిస్తున్న కొత్త చిత్రం ‘టాక్సిక్‌ – ఎ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌-అప్స్‌’. యాక్షన్‌-ప్యాక్డ్‌ డ్రామాగా తెరకెక్కుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశ బెంగళూరులో జరుగుతోంది. వచ్చే ఏడాది మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఇందులో హీరోయిన్‌ రుక్మిణి వసంత్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో జరిగిన చిట్‌ చాట్‌లో ‘టాక్సిక్‌’ గురించి ఆమె ప్రస్తావించారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం పట్ల చాలా ఉత్సాహంగా ఉన్నానంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘టాక్సిక్‌’ అనేది ఇప్పటివరకు కన్నడ లేదా భారతీయ సినిమాల్లో మనం చూసిన వాటన్నంటికంటే భిన్నంగా ఉంటుంది. ఇది రా అండ్‌ రస్టిక్‌గా ఎన్నో లేయర్స్‌తో అద్భుతంగా ఉండబోతోంది. దర్శకురాలు గీతు విజన్‌ ఎంతో బోల్డ్‌గా ఉంటూనే, అదే సమయంలో ఎంతో హద్యంగానూ ఉంటుంది. ఇక ఇందులో యష్‌ పోషించిన పాత్ర సెట్‌లో అందర్నీ సర్‌ప్రైజ్‌ చేస్తుంది.

ఆద్యంతం వైవిధ్యభరితంగా సాగే ఈ సినిమా మిమ్మల్ని ఆసాంతం ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ఇలాంటి అరుదైన సినిమాలో నటించే అవకాశంనాకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నేను పోషించిన పాత్ర నా కెరీర్‌లో ఓ మైల్‌ స్టోన్‌గా నిలిచిపోతుందనే నమ్మకం ఉంది’ అని రుక్మిణి వసంత్‌ చెప్పారు. కన్నడ, ఆంగ్ల భాషలలో రూపొందుతున్న ఈ భారీ సినిమా తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషలలో అనువాదం చేసి, రిలీజ్‌ చేస్తున్నారు. కెవిఎన్‌ ప్రొడక్షన్స్‌, మాన్స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్‌ పతాకంపై వెంకట్‌ కె. నారాయణ, యష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన మేకర్‌ గీతు మోహన్‌దాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సన్‌డాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో జాతీయ అవార్డు, గ్లోబల్‌ ఫిల్మ్‌ మేకింగ్‌ అవార్డుతో సహా అనేక ప్రశంసలను అందుకున్న గీతు మోహన్‌దాస్‌ మరోసారి వండర్‌ఫుల్‌ సినిమాటిక్‌ ఎక్స్‌పీరియెన్స్‌ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -