రోషన్ మాథ్యూ, విశాఖ్ నాయర్, ఇషాన్ ప్రధాన పాత్రల్లో అధ్వైత్ నాయర్ తెరకెక్కించిన చిత్రం ‘చథా పచ్చ : ది రింగ్ ఆఫ్ రౌడీస్’. షిహాన్ షౌకత్, రితేష్ ఎస్. రామకృష్ణన్ నిర్మించిన ఈచిత్రం మలయాళంలో విడుదలై సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీని తెలుగులో ఈనెల 13న సురేష్ ప్రొడక్షన్స్ భారీ ఎత్తున విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా రోషన్ మాథ్యూ మాట్లాడుతూ, ‘మా మూవీని తెలుగులో రిలీజ్ చేస్తున్న సురేష్ ప్రొడక్షన్స్ టీంకు థ్యాంక్స్. మేం ఎంతో కష్టపడి ఈ సినిమాని తీశాం. మలయాళంలో ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. అద్వైత్‌కి ఇది మొదటి చిత్రం. కథ చెప్పినప్పుడు నేను చాలా ఎగ్జైట్ అయ్యాను.
అయితే ఇందులో ఓ స్పెషల్ కేమియో క్యారెక్టర్ ఉంది. ఆ పాత్రకి మమ్ముట్టిని అప్రోచ్ అవ్వడం, మా కోసం ఆయన అంగీకరించడం గొప్ప విషయం. ఆయన పాత్ర ఈ సినిమాకి టర్నింగ్ పాయింట్‌లా ఉంటుంది’ అని తెలిపారు. ‘స్పోర్ట్స్ డ్రామాతో తెరకెక్కించిన ఈ మూవీని ఈనెల 13న రిలీజ్ చేయబోతున్నాం. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. సురేష్ ప్రొడక్షన్స్ నుంచి ఇలానే మంచి కంటెంట్ సినిమాల్ని అందిస్తాం’ అని సురేష్ ప్రొడక్షన్స్ ప్రతినిధి ప్రవీణ్ చెప్పారు. ఈ చిత్రానికి నిర్మాతలు – షిహాన్ షౌకత్, రితేష్ ఎస్. రామకృష్ణన్, కథ, దర్శకత్వం – అధ్వైత్ నాయర్, కెమెరామెన్ – అనెంద్ సి చంద్రన్, స్క్రీన్ ప్లే, సంభాషణలు – సనూప్ తైకూడం, ఫిల్మ్ ఎడిటర్ – ప్రవీణ్ ప్రభాకర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – జార్జ్ సెబాస్టియన్.
భిన్న స్పోర్ట్స్ డ్రామా చిత్రం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



