Monday, January 26, 2026
E-PAPER
Homeక్రైమ్పంజాగుట్టలో డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టు

పంజాగుట్టలో డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టు

- Advertisement -

– నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
నవతెలంగాణ- బంజారాహిల్స్‌

పంజాగుట్టలో డ్రగ్స్‌ విక్రయిస్తున్న ముఠాను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. పంజాగుట్ట ఏసీపీ పి. మురళీ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని పంజాగుట్టలో డ్రగ్స్‌ విక్రయిస్తున్నారనే పక్కా సమాచారంతో హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌తో కలిసి పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ రామకృష్ణ, ఎస్‌ఐ జి. నరేష్‌ బృందం పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై దాడులు నిర్వహించారు. ప్రధాన నిందితుడు కటంగూర్‌ మహన్‌ రెడ్డి, అలియాస్‌ మహన్‌.. డ్రైవర్‌ విధులు నిర్వహిస్తూ బీరంగూడలో నివాసం ఉంటున్నాడు. ఆయన మొహమ్మద్‌ అబ్దుల్‌ నబీ అర్షాద్‌, ముఖేష్‌ బాబు, బన్ని, శ్రీరామ్‌ రవితేజ అలియాస్‌ తేజ, భూపతి సాయి చైతన్య అలియాస్‌ సన్నీతో మాదకద్రవ్యాల సరఫరా చేయిస్తున్నాడు. ఆదివారం వారి నుంచి 10 గ్రాములు ఎండీఎంఏ, 5 సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా కొందరు సరఫరాదారులు, వినియోగదారులు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. నిందితు లపై పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -