Sunday, January 25, 2026
E-PAPER
Homeక్రైమ్విద్యుద్ఘాతంతో బావిలో పడి తండ్రీకుమారుడు మృతి

విద్యుద్ఘాతంతో బావిలో పడి తండ్రీకుమారుడు మృతి

- Advertisement -

– భార్య కండ్ల ముందే విషాదం
– మహబూబాబాద్‌లో ఘటన
నవతెలంగాణ- మహబూబాబాద్‌

మహబూబాబాద్‌ జిల్లాలో తీవ్ర విషాద ఘటన జరిగింది. భార్య కండ్ల ముందే తండ్రి, కుమారుడు విద్యుద్ఘాతంతో బావిలో పడిపోయి మృతిచెందారు. ఈ ఘటన మహబూబాబాద్‌ మండలం బలరాం తండాలో శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. తండాకు చెందిన కేలోత్‌ మదన్‌(32) భార్య అనిత, చిన్న కుమారుడు లక్షిత్‌(4)తో కలిసి శనివారం వ్యవసాయ పొలానికి వెళ్లారు. మదన్‌ ట్రాక్టర్‌తో దుక్కి దున్నిన తరువాత కుమారుడితో కలిసి భోజనం చేశారు. తరువాత కొడుకును భుజాలపై ఎత్తుకొని తీసుకెళ్తుండగా బాలుడు వ్యవసాయ మోటార్‌ విద్యుత్‌ తీగను పట్టుకున్నాడు. దాంతో ఇద్దరూ విద్యుద్ఘాతానికి గురై పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడిపోయారు. భార్య అనిత వారిని చూసి కేకలు వేసింది. సమీపంలోని రైతులు వచ్చేసరికే ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. స్థానికులు మదన్‌ మృతదేహాన్ని వెలికితీశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -