తన అడుగులు అలిసిపోయిన రోజు
నా ప్రయాణం ఆగిపోయింది.
నా వెనకా, ముందు, అన్నీ తనే
కానీ నేనిప్పుడు ఒంటరిగా మిగిలాను
ఆకాశంలో చుక్కల్ని చూపిస్తూ
గడిపిన రాత్రిని తలుచుకుంటుంటే
కళ్ళు ఇప్పటికి తడిగా మారుతున్నాయి…
కొవ్వత్తి వెలుతురులా జీవితం మసకబారిపోయింది,
నిండా చీకటి అలుముకుంది.
అక్షరం ఆసరగా కొత్త వెలుతురు వెతికాను
ప్రతీ కాగితాన్ని ప్రేమతో తడిమితే
నాన్న కవిత్వమై ఎదురుపడ్డాడు.
శిఖరమంత ఎత్తులో శీర్షికగా నిలబడ్డాడు.
అక్షరం అక్షరం అల్లుకుంటు పాతికేళ్ళ జీవితాన్ని రాసాను అందులో
నాన్న లేని ఏకాంతాన్ని రాసినప్పుడు
హదయం ఎడారిలా తడారిపోయేది
కానీ నాన్న ఎప్పుడు ఊటబావిలాంటోడే…
ఆయన నవ్వుల్ని యాదిచేసుకుంటూ
పాదాల దగ్గర సంతకం పెట్టి తన బాటలోనే సాగిపోతాను…
– గుడికందుల అరుణ్, 7093791674
ఊటబావిలాంటి నాన్న
- Advertisement -
- Advertisement -