మల్లు స్వరాజ్యానికి సీపీఐ(ఎం) ఘన నివాళి
న్యూఢిల్లీ : తెలంగాణ ప్రజా సాయుధ దిగ్గజ నేత, భయం ఎరుగని కమ్యూనిస్ట్ విప్లవకారిణి మల్లు స్వరాజ్యం వర్థంతి సందర్భంగా గురువారం ఆమెకు సీపీఐ(ఎం) ఘనంగా నివాళి అర్పించింది. మల్లు స్వరాజ్యం తన 11వ ఏటనే కమ్యూనిస్టు ఉద్యమంలో ప్రవేశించారని, సాయుధ పోరాట సమయంలో రైతులను సంఘటితం చేసి, గెరిల్లా యోధులకు నాయకత్వం వహించారని గుర్తు చేసుకుంది. సాయుధ పోరాటం ముగిసిన తరువాత కూడా భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగించారని తెలిపింది. తరువాత పార్టీ ఆదేశాల మేరకు తన పోరాట స్ఫూర్తిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలోకి తీసుకెళ్లారని, రెండు పర్యాయాలు శాసనసభకు ఎంపికయ్యారని వెల్లడించింది. పార్టీ కేంద్ర కమిటీ సభ్యులుగా, ఆ తరువాత ప్రత్యేక ఆహ్వానితురాలిగా కూడా సేవలందించారు. అణగారిన ప్రజల పక్షాన నిలవడానికి ఎన్నో సామాజిక సంప్రదాయలను బద్దలుకొట్టారని, 80 ఏండ్ల పాటు అచంచలమైన నిబద్ధతతో ఎర్ర జెండాను తన భుజాలపై మోశారని తెలిపింది.
భయం ఎరుగని కమ్యూనిస్ట్ విప్లవకారిణి
- Advertisement -
- Advertisement -



