Thursday, February 5, 2026
E-PAPER
Homeసినిమాఅందర్నీ ఆకట్టుకునే ఫీల్‌ గుడ్‌ సినిమా

అందర్నీ ఆకట్టుకునే ఫీల్‌ గుడ్‌ సినిమా

- Advertisement -

చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్‌ ఎంటర్టైన్మెంట్‌ బ్యానర్‌ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మించిన చిత్రం ‘శ్రీ చిదంబరం గారు’. చింతా రాజశేఖర్‌ రెడ్డి సహ నిర్మాత.
వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా వినరు రత్నం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈనెల 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత చింతా గోపాలకష్ణారెడ్డి బుధవారం మీడియాతో ముచ్చటించారు.
ఈ సినిమాని ఫీల్‌ గుడ్‌ కథతో తెరకెక్కించారు. ఫైట్స్‌, యాక్షన్‌ గోల ఉండదు. ఆహ్లాదకరమైన లొకేషన్స్‌లో చేసిన ఈ మూవీ ప్రశాంతంగా ఉంటుంది. ప్రేక్షకులు థియేటర్స్‌కు కాసేపు రిలాక్స్‌ అయ్యేందుకు వస్తారు. అలాంటి ప్లెజెంట్‌ కంటెంట్‌ ఈ మూవీలో ఉంది.
హీరో, హీరోయిన్స్‌ క్యారెక్టర్స్‌ చాలా బాగుంటాయి. పాటలకు కూడా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ సినిమాకు డిస్ట్రిబ్యూషన్‌ వంశీ నందిపాటి చేస్తున్నారు. ఓటీటీ హక్కులు ఎవరికీ ఇవ్వలేదు. యూఎస్‌, యూకే ఇతర దేశాల్లో సినిమా రిలీజ్‌కు ఇచ్చాం. ఇటీవల సెలబ్రిటీ షో నుంచి కూడా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. టికెట్‌ రేట్‌ కూడా 99 రూపాయలే పెడుతున్నాం. మా సంస్థలో ప్రస్తుతం ‘రావు బహద్దూర్‌’ అనే పెద్ద ప్రాజెక్ట్‌ జరుగుతోంది. ఇంకో సినిమాను కొత్త దర్శకుడితో చేస్తున్నాం. ‘క’ సినిమా సీక్వెల్‌ను త్వరలో అనౌన్స్‌ చేస్తాం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -