Wednesday, April 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకళాకారులను ఒక్కచోటకు చేర్చే ఉత్సవం

కళాకారులను ఒక్కచోటకు చేర్చే ఉత్సవం

- Advertisement -

– ఈ నెల 5న కులవ్యవస్థ నిర్మూలణపై మారథాన్‌ వాక్‌ : ఎస్‌వీకే కార్యదర్శి ఎస్‌.వినయకుమార్‌
– ఏప్రిల్‌లో కుల వ్యవస్థ నిర్మూలన సాంస్కృతి ఉత్సవం కార్యక్రమాలు
నవతెలంగాణ – ముషీరాబాద్‌

సాహితీవేత్తలు కవులు, కళాకారులను ఒక తాటిపైకి తీసుకొచ్చే మొట్టమొదటి ఉత్సవం.. ‘కుల వ్యవస్థ నిర్మూలన సాంస్కృతి ఉత్సవం’ అని ఎస్‌వీకే కార్యదర్శి ఎస్‌.వినయకుమార్‌ తెలిపారు. హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం సాంస్కృతిక, సామాజిక సంఘాలు, సంస్థలు, సాహితీవేత్తలు, కళాకారుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్‌ 5న ఉదయం 6 గంటలకు హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులో ‘కుల వ్యవస్థను నిర్మూలిద్దాం’ అంటూ మారథాన్‌ వాక్‌ ఉంటుందని తెలిపారు. అదేరోజు ఉదయం 11 గంటలకు ఎస్‌వీకేలో కవి సమ్మేళనం జరగ నుందని, ఇందులో 100 మందికిపైగా కవులు, కళాకారులు పాల్గొంటారని చెప్పారు. ఏప్రిల్‌ 11న ఉదయం 11 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం ముందు ప్రదర్శన (ఎగ్జిబిషన్‌) ప్రారంభమ వుతుందన్నారు. సాయంత్రం 5 గంటలకు ఆదర్శ దంపతులతో మానవహారం నిర్వహించి, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌ నుంచి సుందరయ్య కళానిలయం వరకు కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. సాయంత్రం 6గంటల వరకు సుందరయ్య కళానిలయంలో నాటికలు, పాటల కచేరీలు, నృత్య ప్రదర్శనలు ఉంటాయని వివ రించారు. 12న మహాత్మా జ్యోతిరావు ఫూలే నాటకం, 13న కుల వ్యవస్థ నిర్మూలన పాటలతో లఘు చిత్రాల ప్రదర్శన, జానపద కళాకారుల ప్రదర్శనలు, అరుణోదయ విమలక్క బృందం ప్రజాగీతాలు ఉంటాయని తెలిపారు. 14న సాయంత్రం 6 గంటలకు ”తులసి తీర్థం” నాటిక ప్రదర్శనతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్ర మాలు, బహుమతుల ప్రదానం ఉంటుందన్నారు. ఈ ఉత్సవాల్లో విశ్వవిద్యాలయ విద్యార్థులు వీధి నాటికలు, డప్పుల దరువులు, చిత్రలేఖనం, వ్యాస రచన పోటీల్లో పాల్గొంటారని, విజేతలకు బహుమ తులు, సర్టిఫికెట్లు అందజేస్తామని తెలిపారు.
టీపీఎస్‌కే రాష్ట్ర అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కుల రహిత సమాజ నిర్మాణం కోసం మేధావులు, ప్రజా సంఘాలు, సాహితీవేత్తలు, కళాకారులు ఒకే వేదికపైకి రావా ల్సిన అవసరం ఉందన్నారు. కుల వ్యవస్థ నిర్మూల నను ఉమ్మడి లక్ష్యంగా తీసుకుని సామాజికమార్పు దిశగా ముందడుగు వేయాలని కోరారు. ”కులాన్ని పాటించం-మనిషిని ప్రేమిస్తాం” అనే నినాదంతో విస్తృతప్రచారం నిర్వహిస్తూ, కులవ్యవస్థ నిర్మూలన ప్రతిజ్ఞలు చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీపీఎస్‌కే గౌరవ అధ్యక్షులు జి.రాములు, కుల నిర్మూలన సంఘం రాష్ట్ర అధ్యక్షులు వహీద్‌, విశ్వజన కళామండలి వ్యవస్థాపకులు మాస్టర్‌ జీ, విజ్ఞాన దర్శిని టి.రమేష్‌, ఇంద్రవెల్లి రమేష్‌, అంతడ్పుల నాగరాజు, బి.నాగభూషణం, అరసం కవయిత్రి రూప రుక్మిణీ, పీబీ చారి, రచయిత్రి లక్ష్మి, నాగేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -