- Advertisement -
పోలీస్ పహారా మధ్య యూరియా బస్తాల పంపిణీ
నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండలం పొన్కల్ ప్రాథమిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో యూరియా బస్తాలు రాగానే రైతులు ఒక్కసారిగా గుమిగూడారు. దీంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రైతులను క్యూలైన్లో నిలబెట్టి ఏఓ సంగీత సహకారంతో టోకెన్లు అందజేశారు. మొత్తం 798 బస్తాలు వచ్చాయని, రైతులు తొందరపడకుండా తమ వంతు కోసం వేచి ఉండాలని ఏఓ సూచించారు. మండలంలోని దేవుని గూడా రైతు వేదికలో 266, కలమడుగు గ్రామంలో ఉన్న రైతు వేదికలో 266 యూరియా బస్తాలు వచ్చాయన్నారు కావలసిన రైతులు ఆయా గ్రామాల్లో తీసుకోవాలని ఏవో సంగీత సూచించారు.
- Advertisement -