Wednesday, August 6, 2025
E-PAPER
Homeజిల్లాలుపందుల చోరీ విషయంలో గొడవ.. వ్యక్తి మృతి

పందుల చోరీ విషయంలో గొడవ.. వ్యక్తి మృతి

- Advertisement -

నవతెలంగాణ – వెల్దండ
వెల్దండ మండల కేంద్రం పరిధిలోని శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్ సమీపంలో పందుల చోరీ విషయంలో ఎరుకలి కులస్తులకు జరిగిన ఘర్షణలో బెల్లంకొండ రాములు (40) మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. వెల్దండ ఎస్సై కురుమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. కల్వకుర్తి పట్టణం విద్యానగర్ కాలనీకి చెందిన బెల్లంకొండ రాములకు చెందిన పందులు చోరీకి గురి కావడంతో బుధవారం మధ్యాహ్నం వెల్దండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

అనంతరం వెల్దండ గ్రామానికి చెందిన మానూపాటి వెంకటమ్మ , మునుపాటి అన్వేష్, మానుపాటి పవన్, మానుపాటి శివ లకు చెందిన పందుల దొడ్డిలో పందులు ఉన్నట్లు అనుమానంతో వెతికేందుకు రాములు వారి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్ సమీపంలోని పందుల దొడ్డి వద్దకు చేరుకున్నారు. దీంతో రాములు , మానుపాటి వెంకటమ్మ కుటుంబ సభ్యులకు ఘర్షణ చోటుచేసుకుంది. ఘర్షణలో గాయపడిన రాములు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురికి గాయాలను ఎస్ఐ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -