Friday, October 10, 2025
E-PAPER
Homeసినిమామనల్ని మనం చూసుకునే అద్దం లాంటి సినిమా

మనల్ని మనం చూసుకునే అద్దం లాంటి సినిమా

- Advertisement -

వినోద్‌ వర్మ, అనసూయ భరద్వాజ్‌, సాయి కుమార్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘అరి’. ‘మై నేమ్‌ ఈజ్‌ నో బడీ’ అనేది ఉపశీర్షిక. ఆర్వీ సినిమాస్‌ పతాకంపై రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి (ఆర్‌వీరెడ్డి) సమర్పణలో శ్రీనివాస్‌ రామిరెడ్డి, డి.శేషురెడ్డి మారంరెడ్డి, డా. తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, బీరం సుధాకర్‌ రెడ్డి నిర్మించారు. లింగ గుణపనేని కో ప్రొడ్యూసర్‌. జయశంకర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏషియన్‌ సురేష్‌ డిస్ట్రిబ్యూషన్‌ ద్వారా నేడు (శుక్రవారం) వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ పలువురు రాష్ట్ర మంత్రులు, సినీ, రాజకీయ ప్రముఖులు అతిథులుగా ఘనంగా జరిగింది. సాయికుమార్‌ మాట్లాడుతూ,’జయశంకర్‌ అరిషడ్వర్గాల నేపథ్యంగా సినిమా అని చెప్పిప్పుడు కొత్తగా అనిపించింది. ఆరు పాత్రలతో జయశంకర్‌ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. మా ఆరు పాత్రలు ఎక్కడా కలవవు. అందుకే మీతో పాటు నేను కూడా థియేటర్‌లో ఈ సినిమా ఎలా వచ్చిందో చూడాలని అనుకుంటున్నా. నా 50 ఏళ్ల నట జీవితంలో ఇలాంటి చిత్రంలో నటించినందుకు గర్వపడుతున్నా’ అని తెలిపారు.

‘అరిషడ్వర్గాల నేపథ్యంగా అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ జోడించి మా దర్శకుడు జయశంకర్‌ ఈ సినిమాను రూపొందించారు. కథ విన్నప్పుడే ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటుందనే నమ్మకం కలిగింది. ఈ సినిమా కాన్సెప్ట్‌ను ఎంతోమంది పెద్దవాళ్లు ప్రశంసిస్తున్నారు. మా మూవీకి మంచి విజయాన్ని అందిస్తారని ఆశిస్తున్నా’ అని నిర్మాత తిమ్మప్ప నాయుడు పురిమెట్ల చెప్పారు. మరో నిర్మాత శ్రీనివాస్‌ రామిరెడ్డి మాట్లాడుతూ, ‘మనిషి ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అనే పాయింట్‌తో దర్శకుడు జయశంకర్‌ ఈ సినిమాను రూపొందించారు. మాకు సింగిల్‌ లైన్‌లో ఆయన చెప్పిన కథ నచ్చి ఈ మూవీని నిర్మించాం. మనలోనే అరిషడ్వర్గాలు అనే శత్రువులు ఉంటాయి. వాటిని జయించినప్పుడే గొప్ప స్థాయికి వెళ్తాం. ఈ సినిమా నిర్మాణంలో భాగమైన నా తోటి నిర్మాతలకు థ్యాంక్స్‌’ అని తెలిపారు. ‘ఈ సినిమా మనల్ని మనం చూసుకునే అద్దం లాంటిది. అరిషడ్వర్గాల కాన్సెప్ట్‌ను ఎంతోమంది సద్గురులను కలిసి ఒక ఎంటర్‌ టైనింగ్‌గా ఈ చిత్రంలో రూపొందించాను’ అని డైరెక్టర్‌ జయశంకర్‌ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -