Thursday, October 2, 2025
E-PAPER
Homeసినిమాఈ ట్రెండ్‌కి తగ్గ సినిమా

ఈ ట్రెండ్‌కి తగ్గ సినిమా

- Advertisement -

క్రేజీ టైటిల్‌, డిఫరెంట్‌ స్టోరీతో రామకృష్ణ వట్టికూటి సమర్పణలో అలుక్కా స్టూడియోస్‌, శ్రీ వారాహి ఆర్ట్స్‌, భవిష్య విహార్‌ చిత్రాలు బ్యానర్లపై రూపొందుతున్న చిత్రం ‘మటన్‌ సూప్‌’. ‘విట్‌నెస్‌ ది రియల్‌ క్రైమ్‌’ ట్యాగ్‌ లైన్‌. రమణ్‌, వర్షా విశ్వనాథ్‌ హీరో, హీరోయిన్లుగా రామచంద్ర వట్టికూటి తెరకెక్కించిన చిత్రమిది. మల్లిఖార్జున ఎలికా (గోపాల్‌), రామకష్ణ సనపల, అరుణ్‌ చంద్ర వట్టికూటి నిర్మాతలుగా రానున్న ఈ నూతన చిత్రానికి సంబంధించిన టైటిల్‌ పోస్టర్‌, మోషన్‌ పోస్టర్‌, పాటలు ఇప్పటికే సోషల్‌ మీడియాలో అందరినీ ఆకట్టుకున్నాయి. దసరా పండగ సందర్భంగా బుధవారం ఈ చిత్ర టీజర్‌ను డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి రిలీజ్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, ”మటన్‌ సూప్‌’ టైటిల్‌ చాలా బాగుంది. టీజర్‌ బాగుంది. టీం కూడా చాలా కొత్తగా ఉంది. దర్శకుడు రామచంద్ర, హీరో రమణ్‌, సినిమా టీంకు ఆల్‌ ది బెస్ట్‌.

ఈనెల 10న చిత్రం రాబోతోంది. అందరూ చూసి పెద్ద సక్సెస్‌ చేయాలి’ అని అన్నారు. ‘గ్రేట్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి మా టీజర్‌ను లాంచ్‌ చేయడం ఆనందంగా ఉంది. మంచి స్క్రీన్‌ ప్లేతో మా చిత్రం రాబోతోంది’ అని నిర్మాత మల్లిఖార్జున ఎలికా (గోపాల్‌) చెప్పారు. రామచంద్ర వట్టికూటి మాట్లాడుతూ, ‘క్రమశిక్షణకు, నిబద్దతకు మారు పేరు డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి. ఆయన మా టీజర్‌ను లాంచ్‌ చేయటం మా అదృష్టం’ అని తెలిపారు. నిర్మాతలు రామకృష్ణ సనపల, అరుణ్‌ చంద్ర వట్టికూటి మాట్లాడుతూ, ‘ట్రెండ్‌కు తగ్గ కథ. అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పించే సినిమా అవుతుంది’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరో రమణ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ పర్వతనేని రాంబాబు, చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -